మంగళవారం 11 ఆగస్టు 2020
Nagarkurnool - Jun 14, 2020 , 02:22:10

ఆదర్శం తర్నికల్‌ తండా

ఆదర్శం తర్నికల్‌ తండా

కల్వకుర్తి రూరల్‌ : ఒకప్పుడు తండాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేవి. నేడు తండాలను గ్రామపంచాయతీలుగా చేయడంతో పాటు నిధులను కేటాయించడంతో అభివృద్ధికి కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. గ్రామస్తులందరూ తండాల అభివృద్ధికి చర్చించుకుని ప్రణాళికా ప్రకారంగా సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. పచ్చదనం, పారిశుధ్యం వెల్లివిరుస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ సర్కా ర్‌ ఇచ్చిన హామీ మేరకు ఐదొందలు జనాభా దా టిన అనుబంధ గ్రామాలు, తండాలను గ్రామపంచాయతీలుగా మార్చారు. దీంతో కల్వకుర్తి మండలంలో నూతనంగా నాలుగు జీపీలు (తర్నికల్‌ తండా, బెక్కర, వెంకటాపూర్‌ తండా, జీడిపల్లి తండాలు) ఏర్పడ్డాయి. నూతనంగా ఏర్పడిన గ్రా మాలు ఇతర పల్లెలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ నాలుగు కొత్త జీపీల్లో తర్నికల్‌ తండా ముందున్నది. జీపీగా ఏర్పడక ముందు గ్రామానికి బీటీరోడ్డు, మౌలిక వసతులు లేక అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. 

జీపీగా మారిన తర్వాత ముం దుగా ప్రజాప్రతినిధుల సహకారంతో బీటీ రోడ్డు ను ఏర్పాటు చేసుకున్నారు. జీపీ నిధులతో ప్రాధాన్యతల వారీగా సీసీ రోడ్లు, మురుగుకాల్వలు, వీధిదీపాలు, ఇంటింటికీ నల్లా కనెక్షన్‌ సౌకర్యాలను క ల్పించారు. పల్లెప్రగతిలో గ్రామస్తులందరినీ భాగస్వాములను చేసి స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దారు. వైకుంఠధామం, నర్సరీ, వ్యక్తిగత మరుగుదొడ్లు ఇ లా అన్ని ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ నూతనంగా ఏర్పడిన గ్రా మాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. ఒకప్పటి తర్నికల్‌ తండాను, ఇప్పుడున్న తండాను చూసిన వా రు ఆశ్చర్యపడక మానరు. హరితహారంలో నాటి న మొక్కలకు సైతం ట్రీగార్డులు, ముళ్ల కంచెలను వేయడంతో పాటు నిత్యం నీరందిస్తున్నారు. ప్రతి ఇంటి ముందు వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు, ఇంటింటికీ నల్లా కనెక్షన్‌, విద్యుత్‌ సదుపాయం వంటి వాటిని ఏర్పాటు చేసుకున్నారు. తండాను సందర్శించిన అధికారులు, ప్రజాప్రతినిధులు భేష్‌ అంటూ కితాబిస్తున్నారు. 


logo