శనివారం 30 మే 2020
Nagarkurnool - May 06, 2020 , 02:17:25

మున్సిపల్‌ సిబ్బంది సేవలు అమోఘం

మున్సిపల్‌ సిబ్బంది సేవలు అమోఘం

నాగర్‌కర్నూల్‌ టౌన్‌/తెలకపల్లి : మున్సిపల్‌ సిబ్బంది సేవలు అమోఘమని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక సాయి గా ర్డెన్స్‌లో ఎమ్మెల్యే మర్రి ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులకు పాదపూజ చేసి సత్కరించారు. అనంతరం కార్మికులతో సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్‌ జక్కా రఘునందన్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఈశ్వర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కల్పన, వైస్‌చైర్మన్‌ బాబురావు, జెడ్పీటీసీ శ్రీశైలం, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. అలాగే తెలకపల్లి మండలంలోని చిన్నముద్దునూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎ మ్మెల్యే మర్రి పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని ఎమ్మెల్యే మర్రి నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ మ ధు, సింగిల్‌ విండో చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ యాదయ్య పాల్గొన్నారు.


logo