శనివారం 15 ఆగస్టు 2020
Mulugu - Jul 26, 2020 , 07:11:32

శాయంపేటలో రెండు స్పోర్ట్స్‌ అకాడమీలు

శాయంపేటలో రెండు స్పోర్ట్స్‌ అకాడమీలు

  • కేజీబీవీ, హైస్కూల్‌ను పరిశీలించిన జిల్లా క్రీడాధికారి సత్యవాణి

శాయంపేట, జూలై 25 : జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు కింద బాలబాలికలకు వేర్వేరుగా మండలంలో రెండు స్పోర్ట్స్‌ అకాడమీల ఏర్పాటు కోసం శనివారం జిల్లా క్రీడాల శాఖ అధికారి సత్యవాణి మండలంలో పర్యటించారు. మాందారిపేట శివారులోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, శాయంపేటలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, జిల్లా పరిషత్‌ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సత్యవాణి మాట్లాడుతూ జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి సూచనల మేరకు మండలంలో బాలబాలికలకు వేర్వేరుగా రెండు క్రీడా అకాడమీలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం స్పోర్ట్స్‌ అకాడమీ ఏర్పాటుకు అనువుగా ఉందన్నారు. ఇది బాలికలకు సౌకర్యంగా ఉంటుందని వివరించారు. ఈ అకాడమీలో  భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన బాలికలను ఎంపిక చేసి చేర్చుకుంటామన్నారు. ఈ అకాడమీలోకి 40 నుంచి 50 మందికి ప్రవేశాలు కల్పిస్తామని వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే కేజీబీవీలో అకాడమీని ప్రారంభించనున్నట్లు చెప్పారు. కానీ, బాలుర అకాడమీకి సమయం పడుతుందన్నారు. అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాది ప్రారంభించేలా ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు వివరించారు. అకాడమీలో వ్యక్తిగత క్రీడలతోపాటు ఒక బృంద క్రీడకు అవకాశం ఉంటుందని ఆమె చెప్పారు.


తాజావార్తలు


logo