శుక్రవారం 14 ఆగస్టు 2020
Mulugu - Jun 21, 2020 , 02:39:09

నదీ పరివాహక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు

నదీ పరివాహక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు

  • జిల్లాకు రూ.132 కోట్ల కేటాయింపు
  • ఏడు మండలాల్లో 90 గ్రామాలు ఎంపిక
  • స్వయం సహాయక సంఘాల సభ్యులను భాగస్వామ్యం చేయాలి
  • జిల్లా కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌

భూపాలపల్లి కలెక్టరేట్‌ : కృష్ణా-గోదావరి నదుల పరివాహక ప్రాంత పునరుజ్జీవన కార్యక్రమంలో భాగంగా ఎంపికైన మన జిల్లాలో నేల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, వ్యవ సాయం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి ప్ర ణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం సింగరేణి ఇల్లందు క్లబ్‌హౌస్‌లో జిల్లా కలెక్టర్‌ సంబంధిత శాఖల అ ధికారులతో సమావేశమై చేపట్టాల్సిన పనులపై ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం జిల్లాకు రూ.132కోట్ల రూపాయలు కేటాయించిందని, ఈ కార్యక్రమం కింద జిల్లాలోని ఏడు మండలాల్లో 90 గ్రామాలు ఎంపికయ్యా యని, ప్రభుత్వ సూచనల మేరకు ఆయా గ్రామాల్లో నేల కోతకు గురికాకుండా, భూగర్భ జలాలు పెరిగేలా నేల సం రక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. ముఖ్యంగా చెక్‌డ్యాం లు, రాక్‌ఫెల్‌ డ్యాంలు, స్టాగ్‌డ్‌ ట్రెంచ్‌లు, పర్క్యూలేషన్‌ ట్యాంకులు, బోర్వెల్‌ రీఛార్జ్‌ స్ట్రక్చర్స్‌, సర్ఫేస్‌ స్టోరేజ్‌ పాం డ్స్‌, ఫామ్‌ పాండ్స్‌ తదితర నిర్మాణాలతో పాటు వ్యవసా యం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతులను అభివృద్ధి చేసేందుకు ప్లాంటేషన్‌ వర్క్స్‌, అగ్రో ఫారెస్ట్రీ, ఏపీ కల్చర్‌, మల్బరీ ప్లాంటేషన్‌, లైవ్‌ ఫెన్సింగ్‌, పాడి ఆవుల పెంపకం, పౌల్ట్రీ, పశుగ్రాసం పెంపకం, బ్లాక్‌ ప్లాంటేషన్‌ పనులను చేపట్టేందుకు అర్హులైన రైతులను గుర్తించి ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేయాలన్నారు. అలాగే ఏడు మం డలాలను క్లస్టర్లుగా విభజించి రైతులకు వ్యవసాయ, వ్యవ సాయ అనుబంధ రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు బిల్డింగ్స్‌ ఏర్పాటుచేయాలని, వ్యవసాయ ఉత్పత్తులపై పరిశోధన జరిగేలా వసతులు కల్పించాలని, అలాగే వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి, రెవెన్యూ, పశుసంవర్థక, ఉద్యానవన తదితర సంబంధిత శాఖల అధికారులు పది రోజుల్లో  క్లస్టర్లవారీగా ప్రణాళికలు సిద్ధం చేయాలని, స్వయం సహా యక సంఘాల మహిళా సభ్యులను భాగస్వామ్యం చేయా లని అన్నారు. సమావేశంలో భూపాలపల్లి ఆర్డీవో వైవీ గణేశ్‌, ఏడీఏ సత్యంబాబు, తహసీ ల్దార్లు, ఎంపీడీ వోలు, ఏవోలు పాల్గొన్నారు.

సకాలంలో పంట రుణాలివ్వాలి..

రైతులకు సకాలంలో పంట రుణాలు ఇవ్వా లని జిల్లా కలెక్ట ర్‌ అబ్దుల్‌ అజీమ్‌ బ్యాంక ర్లను ఆదేశించారు. శనివారం జిల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడా రు. వానకాలం సీజన్‌ ప్రారంభమైనందున నిర్ణీత లక్ష్యం మేరకు పంట రుణాలను అన్నారు. తహసీల్దార్లు గ్రామా ల్లో పర్యటిం చి వ్యవసాయ క్షేత్రాల్లో మోకా పై ఉన్న రైతులను గుర్తించి పట్టాదారు పాస్‌ పుస్తకం త్వరగా అందించేలా చూడాలని, ఫేక్‌ పట్టాదారులను గుర్తించి వారిపై తగిన చర్య తీసుకోవాలని తద్వారా రైతులు పంట రుణాలను పొందడం సులభం అవుతుందని అన్నారు. భూమి లేకుండా పంట రుణాలు పొందిన వారిని గుర్తించి వారి నుంచి అపరా ధ రుసుముతో రుణాలను రికవరీ చేయాలని ఆదేశించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో పంట రుణాలను మాఫీ చేసేలా ప్రభుత్వానికి లేఖ రాయాలని జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌రావును ఆదేశించారు. భూపాల పల్లి పట్టణంలో బ్యాంకుల చెస్ట్‌ బ్రాంచ్‌ ఏర్పాటు చేసేందు కు అవసరమైన స్థలం అందించేం దుకు చర్యలు తీసుకో వాలని ఆర్డీవో గణేశ్‌ను ఆదేశించారు. సమావేశంలో డీఏవో నగేశ్‌, ఏడీఏ సత్యంబాబు, తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.


logo