గురువారం 06 ఆగస్టు 2020
Mulugu - Feb 09, 2020 , 02:41:01

జాతరకు వంద ఎకరాలు సేకరిస్తాం

జాతరకు వంద ఎకరాలు సేకరిస్తాం

ములుగుజిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో వంద ఎకరాల భూమిని సేకరించి ప్రతి శాఖకు శాశ్వత భవనాలు నిర్మించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం వన దేవతల గద్దెల సమీపంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌, జిల్లా కలెక్టర్లు, ఐజీ, ఎస్పీలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గత జాతరలకన్నా మెరుగైన వసతులతో చిన్న పొరపాటు లేకుండా అద్భుతంగా నిర్వహించామని సీఎం కేసీఆర్‌ మేడారం జాతర ఏర్పాట్లు, అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష చేయడం వల్లే జాతర సక్సెస్‌ అయిందని సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదాలు తమను నడిపించాయని అన్నారు. 

తల్లుల దీవెనలతోనే 

తల్లుల దీవెనలతోనే ముఖ్యమంత్రి తల్లులను దర్శించుకున్నారన్నారని సీఎం జాతరకు వస్తా రా.., రారా అనే సందిగ్ధంలో ఉన్నామని, తల్లులను దర్శించుకునే భాగ్యం సీఎం కలిగినందునే వారి బావ మరణం ఒకరోజు వాయిదా పడిందని ఆ సంఘటన జరిగి ఉంటే ఆయన తల్లులను దర్శించుకునే అవకాశం ఉండేది కాదని అన్నారు. తల్లుల దీవెనలు ఉండడం వల్ల ముఖ్యమంత్రి తల్లులను దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని మమ్మల్ని ఆశీర్వదించారన్నారు. 

ప్రతి ఒక్కరి సేవలు అద్భుతం

జాతరలో ప్రతి శాఖకు చెందిన అధికారులు, ఉద్యోగులు సహకరించడం వల్లే జాతర అద్భుతంగా విజయవంతమైందని వెల్లడించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్లనే గతంలో కన్నా మెరుగైన వసతులు కల్పించి విజయవంతం చేశామని చెప్పారు. జాతరలో విధులు నిర్వహించిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తమ సేవలను తల్లుల కోసం చేశామనే భావనతో పని చేశారని వారి సేవలను మంత్రి కొనియాడారు. సమన్వయం సమష్టి కృషితో జాతర సంతృప్తికరంగా నిర్వహించగలిగామన్నారు. భక్తులు జాతర ఏర్పాట్లపై సంతృప్తితో తల్లులను దర్శించుకొని భక్తిభావాన్ని పెంపొందించుకొని తల్లుల దీవెనలు పొందారన్నారు. స్థానిక ఎమ్మెల్యే సీతక్కతో పాటు ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ నేతలు సైతం వచ్చి జాతర ఏర్పాట్లను చూసిన అనంతరం విమర్శల జోలికి వెళ్లలేదన్నారు. జాతర విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. జాతర నిర్వహణలో ఆదివాసీలు, పూజారులు సహకరించారని తెలిపారు. 

ఆరు నెలల నుంచి ...

ఆరు నెలల నుంచి జాతర నిర్వహణపై అనేక ప్రణాళికలను, కార్యాచరణలు చేశామని నార్త్‌జోన్‌ ఐజీ నాగిరెడ్డి అన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్‌ నియంత్రణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించడం వలన సత్ఫలితాలు వచ్చాయన్నారు. తల్లుల దర్శనానికి రెండు వైపులా నుంచి అనుమతి ఇవ్వడం, రెండు ద్వారాల నుం చి భక్తులను బయటికి పంపించడం ప్రతిరోజు 15 లక్షలకు పైగా భక్తులకు దర్శనాలు చేయించడం, రాష్ట్రంలో ఎక్కడా జరగలేదని అన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి దర్శనాలు చేయించడం సాధ్యం కాదని అది కేవలం తల్లుల మహిమతోనే సాధ్యమైందని అన్నారు. భక్తుల సహకారంతోనే పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించగలిగామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు, అవాంఛనీయ ఘటనలు జరుగకపోవడంపై సం తృప్తి వ్యక్తం చేశారు. ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ మాట్లాడుతూ.. సమన్వయంతో సమస్యలు లేకుండా జాతరను విజయవంతం చేశామన్నారు. జాతర నిర్వహణ బాధ్యతలు తీసుకున్న అన్ని విభాగాల అధికారుల సమష్టిగా పని చేశారని చెప్పారు. జాతర నోడల్‌ ఆఫీసర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం జాతర నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించి విజయవంతం చేసింన్నారు. నిరంతర దర్శనాలపై ప్రత్యేక దృష్టి సారించి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూశామన్నారు.  జాతర ఓఎస్‌డీ, జిల్లా కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ట్రైబల్‌ వెల్ఫేర్‌ కమిషనర్లు జాతర నిర్వహణలో ప్రధాన దృష్టి పెట్టడం వల్లే ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతమైందన్నారు. డీఐజీ ప్రమోద్‌కుమా ర్‌ మాట్లాడుతూ.. జాతర బందోబస్తును విజయవంతంగా పూర్తి చేశామని, సమష్టిగా వేసిన ప్రణాళికలు మంచి ఫలితాలను అందించాయని తెలిపారు. పార్కింగ్‌, ట్రాఫిక్‌ను నియంత్రణలో సఫలమయ్యామని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ సంగ్రాం సింగ్‌పాటిల్‌ మాట్లాడుతూ.. జాతర ‘న భూతో నా భవిష్యత్‌' అనే విధంగా ఏర్పాట్లు చే శారు. డీజీపీ, సీఎస్‌ల సూచనలు, సలహాలు, ఉ న్నతాధికారుల అనుభవాలతో లోపాలను సరిచేసుకుం టూ జాతరను విజయవంతం చేశామని పేర్కొన్నారు. సమావేశంలో మేడారం జాతర పు నరుద్ధరణ కమిటీ చైర్మన్‌ ఆలం రామ్మూర్తి, మే డారం ఆలయ ఈవో రాజేంద్రం, సమాచార పౌర సం బంధాల శాఖ జేడీ డీఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. 


logo