బుధవారం 05 ఆగస్టు 2020
Mulugu - Feb 01, 2020 , 03:22:30

నేడు మేడారంలో మంత్రుల పర్యటన

నేడు మేడారంలో మంత్రుల పర్యటన

ములుగు జిల్లా ప్రతినిధి/నమస్తేతెలంగాణ: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో నేడు మంత్రులు తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన, స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, రోడ్లు భవనాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పర్యటించనున్నారు. మంత్రులు ఉదయం 8.30గంటలకు హైదరాబాద్‌ నుంచి బయల్దేరి 8.50లకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో హన్మకొండ చేరుకుంటారు. మధ్యాహ్నం 12గంటలకు రోడ్డుమార్గాన తాడ్వాయిలోని హరిత కాటేజీలో కాసేపు  ఆగనున్నారు. 12.40కి మేడారం చేరుకొని ఆర్టీసీ బేస్‌క్యాంపును ప్రారంభిస్తారు. ఒంటిగంటకు మేడారం రోడ్డు పనులను పరిశీలించిన అనంతరం మేడారం అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం 4గంటలకు హెలికాప్టర్‌లో మేడారం నుంచి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు.


logo