చేగుంట, మార్చి14: అనుమానస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చేగుంట గ్రామ నివాసి పులబోయిన శేఖర్(20) వడియారం రైల్వే బిడ్జి సమీపంలో అనుమానస్పద స్థితిలో పడి మృతి చెందాడు. శేఖర్ మద్యం సేవించి పడి ఉండవచ్చుననిపలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు చేగుంట పోలీసులు ఘటన స్థాలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నటు చెప్పారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.