మద్దూరు(ధూళిమిట్ట), జూలై 30: సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని బెక్కల్ రామలింగేశ్వరస్వామి భూ ముల అన్యాక్రాంతంపై ‘బెక్కల్ ఆలయ భూమికి ఎస రు’ అనే కథనం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో మంగళవారం ప్రచురితమైనది. సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి స్పందించి బెక్కల్ ఆలయ భూ ములపై సమగ్రంగా విచారణ చేయిస్తామని ‘నమస్తే తెలంగాణ ప్రతినిధి’కి ప్రత్యేకంగా తెలియజేశారు.
కాకతీయుల కాలంలో నిర్మితమైన బెక్కల్ రామలింగేశ్వరస్వామి ఆలయ భూ ములతోపాటు ఆలయానికి దాతలు ఇచ్చిన భూమి కొన్నేండ్లుగా అన్యాక్రాంతమవుతున్నా రెవె న్యూ అధికారులు పట్టించుకోలేదని, దీనిపైన అధికారులు పూర్తి స్థాయి లో విచారణ చేపట్టాలని బె క్కల్, బైరాన్పల్లి గ్రామస్తు లు డిమాండ్ చేశా రు.
‘నమ స్తే తెలంగాణ’ కథనంపై ఈ ప్రాంతంలో పెద్దఎ త్తున చర్చ కొనసాగుతున్నది. అన్యాక్రాంతమైన ఆలయ భూముల విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ బయటకు తీసుకురావడాన్ని రామలింగేశ్వరస్వామి భక్తులు ప్రత్యేకంగా అభినందించారు.