మెదక్ జిల్లా కొల్చారంలోని సత్యసాయి ఆగ్రో రైస్‌మిల్ ఇండస్ట్రీస్‌లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, పౌర సరఫరాల శాఖ అధికారుల తనిఖీల్లో భారీగా అక్రమాలు వెలుగుచూశాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పౌర సరఫరాల అధికారులు మిల్లులలో సోమ, మంగళవారం తనిఖీలు చేయగా, ఈ రైస్‌మిల్లులో 3029.960 మెట్రిక్ టన్నుల ధాన్యం(75,749) బ్యాగుల తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. రామచంద్రాపురం చెందిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, మెదక్ జిల్లా పౌర సరఫరాల అధికారులు తనిఖీలు చేశారు. రైస్‌మిల్ యజమాని శ్రీనివాస్‌పై ఈసీ ఏసీటీ-1955 కింద 6-ఏ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రైస్‌మిల్లులో జరిగిన అక్రమాలపై మెదక్ కలెక్టర్‌కు నివేదిక సమర్పించినట్లు అధికారులు తెలిపారు.
2025-26 సీజన్‌కు సంబంధించి 3029.960 మెట్రిక్ టన్నుల ధాన్యం(75.749) బ్యాగులు తక్కువగా ఉన్నట్లు, ఈ ధాన్యం విలువ రూ. 7,17,79,752.40 కోట్లుగా గుర్తించారు. సత్యసాయి ఆగ్రో ఇండస్ట్రీస్‌కు ప్రభుత్వం 2025-26 సంవత్సరం సీజన్‌కు 7,720.52 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించింది. ధాన్యం నుంచి 5,172 మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఉత్పత్తి చేయా ల్సి ఉంది. ఇప్పటి వరకు పుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ) సివిల్ సైప్లెస్ కార్పొరేషన్(సీఎస్సీ)కు 2,207 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ అందజేసింది. దీంతో ప్రభుత్వానికి రైస్‌మిల్లు యాజమాన్యం 2,965. 748 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బకాయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రైస్‌మిల్లులో 4,426.49 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం నిల్వ ఉండాల్సి ఉండ గా, 1,396.53 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నట్లు తనిఖీలో గుర్తించారు. 3,029.96 మెట్రిక్ టన్నుల కొరత రావడంతో కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు.