తూప్రాన్, అక్టోబర్ 17: శివ్వంపేట మండలం ఉసిరికపల్లి వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడిన విషయం తెలిసిందే. గాయపడిన డ్రైవర్ నామ్సింగ్ హైదరాబాద్లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను అప్పగించే సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
శివ్వంపేట మండలం బీమ్లా తండా, సీతారాం తండా, తలపల్లి తండావాసులు పెద్దఎత్తున తూప్రాన్ దవాఖానకు చేరుకున్నారు.డ్రైవర్ నామ్సింగ్ను అప్పగించిన తర్వాతే మృతదేహాలను తరలించాలని పోలీసులతో ఆందోళనకారు లు వాగ్వాదానికి దిగారు. తూప్రాన్ డీఎస్పీ వెంకట్రెడ్డి ఆందోళనకారులను సముదాయించి, బాధి త కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూ స్తామని హామీ ఇచ్చారు. తూప్రాన్ సీఐ రంగ కృష్ణ, ఎస్ఐ శివానందంలతో పాటు శివ్వంపేట, మనోహరాబాద్ మండలాల పోలీసుల మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.