కౌడిపల్లి , డిసెంబర్14 : మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని తునికి గ్రామ శివారులోని గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఏకలవ్య కృషి విజ్ఞాన కేంద్రానికి ఈనెల 25న ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రానున్నట్లు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. ఉప రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో శనివారం అదనపు కలెక్టర్ నగశ్తో కలిసి నిర్వాహకులతో కలెక్టర్ సమావేశమై ఏర్పాట్లను పరిశీలించారు. కృషి విజ్ఞాన కేంద్రంలో సేంద్రియ విధానంలో సాగుచేస్తున్న పంటలను పరిశీలించి, రైతులతో ఉప రాష్ట్రపతి ముఖాముఖీ కానున్నారు. దీనికి సంబంధించి నిర్వాహకులు చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. వారివెంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ఉన్నారు.