పాపన్నపేట్, సెస్టెంబర్ 8: మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గమాత సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొన్నది. కొన్ని రోజుల నుంచి మంజీరా పరవళ్లు తొక్కడంతో ఏడుపాయల వనదుర్గ మాత ఆలయం మూసివేసిన విష యం తెలిసిందే.
అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి పూజలు చేస్తున్నారు. వర్షాల కారణంగా భక్తుల సందడి కొంతమేర తగ్గింది. మంజీరా ప్రవాహం తగ్గితే అమ్మవారి ఆలయం పునఃప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఏడుపాయల్లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పాపన్నపేట ఎస్త్సె శ్రీనివాస్‌గౌడ్ పకడ్బందీ చర్య లు చేపట్టారు.