గజ్వేల్, ఆగస్టు 25: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మంజూరైన రూ.170కోట్ల నిధులను స్థానిక కాంగ్రెస్ నాయకులు వెనక్కి తీసుకొచ్చి గ్రామాలాభివృద్ధికి కృషి చేయాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.170కోట్ల నిధులను నియోజకవర్గ అభివృద్ధి కోసం రాకుండా అడ్డు పడిందన్నారు.
పెండింగ్‌లో ఉన్న బ్యాలెన్స్ పనుల కోసం కేసీఆర్ ప్రభుత్వం రూ.19కోట్లు మం జూరు చేస్తే స్థానిక నాయకుల అసమర్థత కారణంగా అభివృద్ధి పను లు ఆగిపోయాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గజ్వేల్‌లోని ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, నీటిపారుదల జిల్లా కార్యాలయాలను కొడంగల్‌కు తరలించే ప్రయత్నం చేస్తున్నదన్నారు. మంజూరైన నిధులను కాపాడుకోలేని, సోయిలేని కొంత మంది అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ నాయకులు నైతిక బాధ్యత వహించి ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. వేల కోట్లతో గజ్వేల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కేసీఆర్ అభివృద్ధి చేశారని, ఆయ న్ని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు లేద ని, కనీసం కేసీఆర్ కాలిగోటి కి కూడా సరిపోరని విమర్శించారు.
ఇప్పటికైనా అధికారులు ప్రొటోకాల్ లేని వారికి వత్తాసు పలకడం మానుకోవాలని, లేనిచో త్వరలోనే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు. చిల్లర మా టలు మానుకోవాలని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నదన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే ఆంక్షలు లేకుండా నిబంధనలు పెట్టకుండా బ్యాం కులో రుణం తీసుకున్న ప్రతి రైతుకూ ఏకకాలంలో రూ. రెండు లక్షల పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.