గజ్వేల్, మార్చి 13: సీఎం పదవి ఉంటుందో ఊడుతుందో తెలియని అయోమయంలో రేవంత్‌రెడ్డి ప్రస్టేషన్లో ఆయనేం ఏమీ మాట్లాడుతున్నడో ఆయనకే అర్థం కావడం లేదని తెలంగాణ మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. ప్రజా సమస్యలను తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి.. తనకు చిత్తశుద్ది ఉంటే ప్రజల్లోకి రావాలని డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేలా కేసీఆర్‌ను స్టేచర్ నుండి మార్చరీకి మార్చుతామని మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజలను తప్పుతోవ పట్టించేలా మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డికి ప్రజాకోర్టులో ప్రజలే శిక్షిస్తారని చెప్పారు. పనికి మాలిన మాటలతో కాలం గడుపుతున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో విరక్తి వచ్చిందని అన్నారు. దేశంలోనే కొద్ది రోజుల్లోనే ప్రజల్లో విరక్తి వచ్చేలా పాలించిన సీఎంగా రేవంత్‌రెడ్డిని గిన్నిస్‌బుక్‌లో ఎక్కించాలన్నారు.
ఎక్కడ సమావేశాలు పెట్టిన కేసీఆర్ జపం తప్పా రేవంత్‌రెడ్డికి మరో ద్యాస లేదని, ఆయన్ని తలచుకొనిదే సమావేశాలు జరగవని ప్రతాపరెడ్డి పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావులు, ఉపాధ్యాయులు బీజేపీకి పట్టం కట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిరస్కరించారని గుర్తు చేశారు. దీంతో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వాసం కోల్పోయిన రేవంత్‌రెడ్డి ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయలేని పరిస్థితిలో కేసీఆర్ కుటుంబంపై సమాజం తలదించుకునేలా విమర్శలు చేస్తున్నారన్నారు. దేవాదుల కింద సుమారు 50వేల ఎకరాల్లో వరి ఎండిపోతుందని, హాల్ది వాగులో నీళ్లు లేక సాగుచేసిన పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. ప్రతిపక్షం పోరాటం చేసి తట్టి లేపితేకాని లేవలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు.
నమ్మించి ఓట్లు వేయించుకున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి రైతులు, మహిళలు, నిరుద్యోగులు ఆశపడి ఓటు వేస్తే అందర్నీ మోసం చేశారని ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ప్రతాపరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వానికి రూ.18 వేల కోట్ల ఆదాయం వస్తుంటే సంక్షేమానికి, ఉద్యోగులు జీతాలకు సరిపోవడం ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. ఏటా 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి ఎక్కడికి పోయాడన్నారు. సీఎంగా ఆర్థిక వ్యవస్థను, అప్పులను పరిగణలోకి తీసుకొని హామీలివ్వాలని కాని నోటికొచ్చిన విధంగా హామీలివ్వడం ఆయనకే చెల్లుతుందన్నారు. 2014 ఉమ్మడి రాష్ట్రంలో రూ.68వేల కోట్ల బడ్జెట్ ఉంటే 2023లో రూ.2.99 లక్షల కోట్లకు చేరిందని అంటే కేసీఆర్ అంచలంచెలుగా మూడింతలు పెంచారన్నారు. ప్రత్యేక తెలంగాణలో మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రాష్ట్రంలో రెండు లక్షల ఎకరాల భూసేకరణ చేపట్టారన్నారు. గతంతో పోల్చితే స్వరాష్ట్రం ఏర్పాటైన తరువాత 1.50లక్షల ఎకరాల భూమి మాగాణిగా మారిందన్నారు. దేశంలోనే నెంబర్ వన్‌గా దిగుబడి వచ్చేలా కేసీఆర్ ప్రాజెక్టులు చేపట్టారని, తద్వారా తెలంగాణలో 3.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందన్నారు. మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్, రంగ నాయక సాగర్ పరిధిలోని కాలువల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ప్రోటోకాల్ లేని వ్యక్తులు పరిజ్ఞానం లేకుండా గ్రామాల్లో అభివృద్ధి పనులకు కొబ్బరికాయలు కొడుతున్నరని, అధికారులు ఏమీ చేస్తున్నారని వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రశ్నించారు. అధికారులకు ప్రోటోకాల్ ఎవరికి ఉందో తెలియదా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం ఇవ్వాలన్నారు. డిపాజిట్లు కూడా రాని వ్యక్తులు కొబ్బరికాయలు కొట్టడాన్ని తప్పుబట్టారు. అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు, నవాజ్‌మీరా, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జకియోద్దిన్, ఆత్మకమిటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ కౌన్సిలర్లు గోపాల్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, కనకయ్య, రవీందర్, పంబాల శివకుమార్, శ్రీధర్, దేవేందర్, భూపాల్‌రెడ్డి, ఖాసీం, రఘుపతిరెడ్డి. దయానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.