తూప్రాన్, నవంబర్ 4: గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ జిల్లా తూ ప్రాన్ మండలంలోని మల్కాపూర్‌లో ఆయన పర్యటించారు. ఇటీవల మరణించిన వడ్డె రాజు కుటుంబాన్ని, ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని దగ్ధమైన ఎర్ర భూదమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.
అనంతరం రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలిం చి వారితో మాట్లాడారు. ఇప్పటివరకు గ్రామాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బస్వన్నగారి సత్యనారాయణ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి పంజాల ఆంజనేయులు గౌడ్, మాజీ ఎంపీటీసీ సంతోష్ రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ గోపినాయక్, జిన్న రాజు, చంద్రం, స్వామి, బాబు, సత్యం, పరమేశ్వర్, కృష్ణ, యాదగిరి, సాయిలు, జముల నాయక్, శ్రీనివాస్, గణేశ్ పాల్గొన్నారు.