ములుగు, ఏప్రిల్ 22: ఈనెల 27న ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బీఆర్ఎస్ నాయకలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మె ల్సీ యాదవరెడ్డి పిలుపునిచ్చారు. ములుగులో మంగళవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జహంగీర్, డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మోసపూరిత వాగ్ధానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తక్కువ కాలంలోనే రేవంత్ సర్కార్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నదని, కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
ప్రజల మనస్సులో బీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్ పరిపాలనపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ వింగ్ ఉపాధ్యక్షుడు జుబేర్‌పాషా, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నర్సంపల్లి అర్జున్‌గౌడ్, పెద్దబాల్ అంజన్‌గౌడ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కుక్కల నరేశ్‌గౌడ్, బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి కొమ్ము నవీన్‌కుమార్, నాయకులు, గణేశ్‌గుప్తా, శ్రీనివాస్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.