నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్, సెప్టెంబర్ 11 : అన్నదాతలను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. ఆరుగాలం కష్టపడుతున్నా యూరి యా అందక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం రైతులకు సకాలంలో సరిపడా యూ రియాను అందించలేక రైతులు కకావికలం అవుతున్నారు. బోరున వర్షం కురుస్తున్నా యూరి యా కోసం రైతన్నలు కార్యాలయాలు, కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నిద్రాహారాలు మాని, బస్తా యూరియా కోసం రాత్రింబవళ్లు పడిగాపులు కాసే దుస్థితి నెలకొన్నది.
యూరి యా లారీ వచ్చిందని తెలిస్తే చాలు భారీ సంఖ్య లో రైతులు క్యూ కట్టేస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గంభీర్పూర్కు చెందిన సీతవ్వ అనే మహిళా రైతు వేకువజామునే కార్యాలయానికి వచ్చి క్యూలో నిల్చోవడంతో సొమ్మసిల్లిపడిపోయింది. ఆమెను వెంటనే దవాఖానకు తరలించడంతో ప్రమాదం తప్పింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు.