సిద్దిపేట, నవంబర్ 23: జబర్దస్త్ యాక్టర్ రాకింగ్ రాకేశ్ నిర్మించిన కేసీఆర్ సినిమాకు అపూర్వ ఆదరణ లభిస్తుంది. సిద్దిపేట పట్టణంలోని బాలాజీ థియేటర్లో సినిమా చూసేందుకు కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు భారీఎత్తున తరలివచ్చారు. సినిమా నడుస్తున్నంత వరకు ఈలలు, కేరింతలతో సినిమా టాకీస్ మారుమోగింది.
సినిమాకు సంగీత దర్శకుడు చరణ్‌అర్జున్ అందించిన పాటలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఓ గిరిజన యువకుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కేసీఆర్ ప్రసంగాలు విని అభిమానిగా మారిపోయే సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి ఎకువగా స్పందన లభించింది. చిత్రంలోని కథానాయకుడు రాకేశ్ చెప్పిన డైలాగులు ఆకట్టుకున్నాయి. కేసీఆర్ ప్రసంగం వచ్చినప్పుడు అభిమానులు హంగామా చేశారు.
కేసీఆర్ సినిమాను మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్యెల్యే హరీశ్‌రావు ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సుతోపాటు, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి, జాప శ్రీకాంత్‌రెడ్డి, ఎడ్ల సోమిరెడ్డి, ఎల్లారెడ్డి, పాల సాయిరామ్తోపాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి చిత్రాన్ని వీక్షించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ రాజనర్సు మాట్లాడుతూ.. సినిమాలో తెలంగాణ యాస, భాషను చకగా తెరకెకించారని, ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సినిమాలకు చకటి వేదిక అయిందన్నారు. సినిమాలో నటించిన నటీనటులందరికీ అభినందంనలు తెలియజేశారు.