పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులకు పారిశ్రామిక వృత్తి విద్యా(ఉపాధి) కోర్సును అందించేందుకు దుబ్బాకలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు సొంత భవనం లేక అద్దె భవనంలో సమస్యల మధ్య కొనసాగుతున్నది. ఐటీఐ కళాశాలలో సుమా రు 20 ట్రేడ్లు (కోర్సులు) వరకు ఉంటాయి. ప్రతి భ ఆధారంగా విద్యార్థులకు ఆయా వృత్తివిద్యా కోర్సుల్లో నైపుణ్య శిక్షణ అందిస్తారు.
రెండేండ్ల పాటు ప్రాక్టికల్స్, థియరీ, తదితర సబ్జెక్టుల శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించడమే ఐటీఐ కళాశాల ముఖ్యఉద్దేశం. అధికారుల నిర్లక్ష్యం మూలంగా దుబ్బాకలోని ఐటీఐ కళాశాల నామమాత్రంగా మా రింది. సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ ఐటీఐ కళాశాలలు మూడు ఉన్నాయి. సిద్దిపేట, కుకునూరుపల్లి, దుబ్బాకలో ఐటీఐ కళాశాలలు కొనసాగుతున్నాయి. ఐటీఐ కళాశాలలపై పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులకు శాపంగా మారింది.
దుబ్బాక, ఆగస్టు 24: దుబ్బాకలో ఐటీఐ కళాశాల ఉన్నట్లు దుబ్బాక ప్రజలకే తెలియదు. అధికారుల నిర్ల క్ష్యం మూలంగా దుబ్బాక ఇండస్ట్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్(ఐటీఐ) కళాశాల నామమాత్రంగా కొనసాగుతున్నది. 2014లో దుబ్బాకకు ఐటీఐ కళాశాల మం జూరైంది. ఈ కళాశాలలో మొదట నాలుగు ట్రేడ్లు (కోర్సులు) ఉండేవి. విద్యార్థులు రాకపోవడంతో మూ డు ట్రేడ్లు కొనసాగించారు.
ప్రస్తుతం ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్ కోర్సులు(ట్రేడ్లు) ఉండగా,కేవలం ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ ట్రేడ్లు మాత్రమే కొనసాగిస్తున్నారు. వెల్డర్ ట్రేడ్‌లో విద్యార్థులు రాకపోవడంతో ఆ ట్రేడ్‌ను కొనసాగించడం లేదు. దుబ్బాకలో ఐటీఐ కళాశాలపై సరైన ప్రచారం లేకపోవడంతో చాలామంది ఉపాధి శిక్షణకు నోచుకోలేకపోతున్నారు. ఈ కళాశాలను చాలా రోజులు ఇన్చార్జి ప్రిన్సిపాల్‌తో కొనసాగించారు. ఇటీవల ప్రిన్సిపాల్ పోస్టు భర్తీ అయ్యింది. ఐదుగురు ఇన్స్ట్రక్టర్లకు ఇద్దరు డిఫ్యుటేషన్‌పై వెళ్లారు. ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఇద్దరు వాచ్మెన్లు, ఇద్ద రు అటెండర్లు ఉన్నారు.
సొంతం భవనం లేకపోవడంతో దుబ్బాక ఐటీఐ కళాశాలకు ఆదరణ లేకుండా పోయింది. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ రెండు ట్రేడ్‌ల్లో మొత్తం 60 మంది విద్యార్థులు ఉండాలి. ఫస్ట్టియర్లో 30 మంది, సెకండియర్‌లో 30 మంది మొత్తం 60 సీట్లు ఉన్నాయి. ఫస్ట్టియర్ అడ్మిషన్లు కొనసాగుతున్నా యి. ప్రస్తుతం రెండు ట్రేడ్‌ల్లో కలిపి ఫస్ట్ ఇయర్లో 15 మంది , సెకండియర్‌లో 22 మంది విద్యార్థులు మాత్ర మే ఉన్నారు. ఇందులో కళాశాలకు పది మంది కూడా రావడం లేదు. విద్యార్థులతో సమానంగా ఇందులో పనిచేస్తున్న సిబ్బంది ఉండడం గమనార్హం.
దుబ్బాకలో 2014లో ఐటీఐ కళాశాల మంజూరు కా గా, మొదట పాత ఎంపీడీవో కార్యాలయంలో, ప్రస్తు తం ఐకేపీ భవనంలో కళాశాల కొనసాగుతున్నది. ఐకేపీ భవనంలో కింద ఓ మోటర్ బైక్ షోరూం కొనసాగుతున్నది. పైన రెండు గదుల్లో ఐటీఐ కళాశాల కొనసాగుతోంది. ఇక్కడ ఐటీఐ కళాశాల ఉన్నట్లు చాలామందికి తెలియదు. కింద ప్రైవేటు బైక్ షోరూం ఉండడంతో ఐటీఐ కళాశాల కనబడకుండా పోయింది. దుబ్బాక -హబ్షీపూర్ రోడ్డు పక్కన ఐటీఐ కళాశాలకు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 5 కోట్లు నిధులు మంజూరు చేసింది. జీ ప్లస్ వన్‌లో ఐటీ ఐ కళాశాల భవనం నిర్మాణం చేపట్టారు. బిల్లులు రాక రూ.3.50 కోట్లతో భవనం అసంపూర్తిగా ఆగిపోయిం ది. విద్యార్థులకు పక్కా భవనం అందని ద్రాక్షగా మా రింది. అసంపూర్తి భవనం ఆసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది.
దుబ్బాకలో ఐటీఐ కళాశాలకు పక్కా భవనం లేకపోవడంతో ప్రస్తుతం అద్దె భవనంలో ఇరుకైన గదుల్లో ప్రాక్టికల్స్, థియరీ చెబుతున్నారు. ఒక గదిలో ప్రిన్సిపాల్, స్టాప్ ఉంటున్నా రు. మరొక గదిలోనే రెండు ట్రేడ్లకు సంబంధించిన విద్యార్థులం ఉంటున్నాం. ఇరుకైన గదిలో ప్రాక్టికల్స్ నేర్పించలేకపోతున్నారు.
– శ్రీకాంత్, ఫిట్టర్ విద్యార్థి
చిన్నపాటి గదిలో అందరికీ బోధించడంతో ఇబ్బందిగా మారింది. ఐటీఐ కళాశాలల రెండు ట్రేడ్లు ఉండగా…ఎలక్ట్రీషియన్, ఫిట్టర్లకు వేర్వేరుగా థియరీ బోధించాల్సి ఉం టుంది. అలా కాకుండా అందరికి ఒకేచోటనే ప్రాక్టికల్స్, థియరీ, ఇతర సబ్జెక్టులను బోధిస్తున్నారు. ఇన్స్ట్రక్టర్లకు, నేర్చుకునేందుకు మాకు ఇబ్బందిగా ఉంది. అధికారులు స్పందించి పక్కా భవ నం పూర్తిచేసి ఐటీఐ కళాశాలను కొనసాగించాలి. ఐటీఐని బలోపేతం చేసి మాకు సౌకర్యాలు కల్పించాలి.
– దేవానంద్, ఎలక్ట్రీషియన్ విద్యార్థి