మెదక్: జిల్లాలోని నర్సాపూర్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని పెద్దచింతకుంటలో ఓ బైకును ఆటో ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది.