Actor Soori | తమిళ సినీ పరిశ్రమలో ఉండే చీకటి కోణాలు ఎప్పుడూ చర్చనీయాంశమవుతూనే ఉంటాయి అన్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ నటుడు, కమెడియన్ నుంచి హీరోగా మారిన సూరి (Soori) తాను ఎదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నాడు. ఒక పెద్ద హీరో చిత్రంలో అతడు నటిస్తున్న సమయంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
ఓ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించేందుకు తనను షూటింగ్‌కు పిలిచారని సూరి తెలిపారు. ఆ సినిమాలో ఒక స్టార్ కమెడియన్‌తో కలిసి నటించే సన్నివేశాన్ని తెరకెక్కించారని చెప్పారు. అయితే, ఆ సీన్ షూటింగ్ పూర్తయిన తర్వాత సంబంధిత పెద్ద హీరో, దర్శకుడు కలిసి మానిటర్లో అవుట్‌పుట్ పరిశీలించి.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తాను ధరించిన చొక్కా విప్పేయమని అడిగారని, రికమండేషన్‌పై వచ్చిన మరో వ్యక్తికి ఆ చొక్కాను బలవంతంగా తొడిగారని సూరి వెల్లడించారు. తాను వేసుకున్నది సొంత బట్టలు అయినప్పటికీ, దాన్ని లెక్కచేయకుండా లాక్కొని కాస్ట్యూమ్ వెహికల్‌పైకి విసిరేశారని వాపోయారు. ఒంటిపై కేవలం ఒక టవల్ మాత్రమే చుట్టుకుని, తీవ్రమైన అవమాన భారంతో తన చొక్కా కోసం తాను పడిన వేదన వర్ణనాతీతమని తెలిపారు. తన సినీ ప్రయాణంలో తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ఈ ఘటనను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
— Amuthabharathi Videos (@videos3210) September 1, 2026