నర్సాపూర్, డిసెంబర్17 : రెండు కార్లు ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన నర్సాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొండాపూర్ సమీపంలో శనివారం జరిగింది. ఎస్సై గంగరాజు వివరాల ప్రకారం.. బాచుపల్లిలో నివాసముంటున్న రాజురాం (40) మెదక్ సమీపంలోని అవుసులపల్లిలో కిరాణా దుకాణం నడిపిస్తూ జీవిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో తన కారులో ఇంటి నుంచి అవుసులపల్లికి బయలుదేరాడు. నర్సాపూర్ మండలం కొండాపూర్ సమీపంలోకి రాగానే మెదక్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న టీఎస్ 35 ఈ 6666 నంబర్ గల కారు రాజురాం ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట, చెన్నయ్యపల్లి గ్రామానికి చెందిన కారు డ్రైవర్ చిట్యాల సుధాకర్ అతి వేగంగా, అజాగ్రత్తతో నడుపుతూ ప్రమాదానికి కారణమయ్యాడని మృతుడి బంధువులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గంగరాజు తెలిపారు.
హైదరాబాద్ నుంచి నర్సాపూర్‌కు శుభకార్యానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి వస్తున్నారు. కాగా, రోడ్డు ప్రమాదాన్ని గమనించి, వెంటనే కారులోంచి దిగి క్షతగాత్రులను పరామర్శించారు. దవాఖానకు తరలించాలని పోలీసులకు సూచించారు. పోలీసులు వారిని అంబులెన్స్‌లో దవాఖానకు తరలించారు.