
మనోహరాబాద్, డిసెంబర్ 14 : తెలంగాణలో ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్ఎస్దేనని జడ్పీ చైర్పర్సన్ ర్యా కల హేమలతాశేఖర్‌గౌడ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించడంతో మనోహరాబాద్ జడ్పీ క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి సంబురాలు నిర్వహించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజా పక్షపాతి అని, నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధులు చైతన్యవంతులని, ఎవరు రాజకీయ లబ్ధికోసం ప్రయత్నిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రతిపక్షాలకు ఈ ఎన్నికలు తగిన గుణపాఠం నేర్పాయన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పురం మహేశ్వర్, ఎంపీపీ పురం నవనీతారవి, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు సలీమొద్దీన్, నాచారం గుట్ట డైరెక్టర్ చంద్రారెడ్డి, సీనియర్ నాయకుడు మన్నె శ్రీనివాస్, నాయకులు పంజా భిక్షపతి, షరీఫ్, మతిన్, అన్వర్, ఆంజనేయులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు..
ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీగా యాదవరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించడంతో మంగళవారం పెద్దశంకరంపేట పట్టణంలో టీఆర్ఎస్ నాయకులు సంబురాలు చేసుకున్నారు. టీఆర్ఎస్ నా యకులు స్వీట్లు పంచుకొని పటాకులు కాల్చారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీ పంతులు, వైస్ ఎంపీపీ రమేశ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సురేశ్‌గౌడ్, నాయకులు సుభాష్‌గౌడ్, దామోదర్, రాఘవులు, శంకర్‌గౌడ్, అశోక్, పున్న య్య, కార్యకర్తలు పాల్గొన్నారు.
గెలుపు సంబురాలు..
ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్ఎస్దేనని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లెగడ్డ నర్సింహులు అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందిన వంటేరు యాదవరెడ్డికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నర్సింహులు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నదన్నారు. ప్రభు త్వ సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు దోహదపడ్డాయని తెలిపారు.
టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుపై హర్షం..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు స్థానా ల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందడం హర్షనీయమని వెల్దుర్తి మండల ఎంపీపీ స్వరూపానరేందర్రెడ్డి, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికలు జరిగిన ఆరు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొంది సత్తాచాటారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే అభ్యర్థులను గెలిపించాయన్నారు. మారుమూల గ్రామాలు సైతం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందుకనుగుణంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ సంక్షేమ పథకాలు యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు.