కొండపాక, ఫిబ్రవరి 11: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కొండపాక టీఆర్ఎస్ నాయకులు శుక్రవారం ఘన స్వాగతం పలికారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న విషయం స్థానిక నాయకులకు తెలియడంతో ఎమ్మెల్సీ కవితను స్థానిక టీఆర్ఎస్ నాయకులు కలిశారు. కొండపాక మండలం దుద్దెడ గ్రామ శివారులోని టూరిజం హోటల్ వద్ద తెలంగాణ జాగృతి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అనంతుల ప్రశాంత్ ఆధ్వర్యంలో మండలంలోని ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ కవితను కలిసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు దేవి రవీందర్, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ ర్యాగళ్ల దుర్గయ్య, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఆరెపల్లి మహదేవ్, ఎంపీటీసీ గురజాడ బాలాజీ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నూనె కుమార్‌యాదవ్, నాయకులు అంబటి బాలచందర్‌గౌడ్, నరేందర్ తదితరులు ఉన్నారు.