వక్ఫ్ బోర్డు దుకాణాలపై పెత్తనం చెల్లదు
నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి
కంగ్టి, ఫిబ్రవరి 26: మహిళా సంక్షేమం కోసం టీఆర్ఎస్ పెద్దపీట వేస్తున్నదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. శనివారం బసవప్రదీప ఫంక్షన్హాల్లో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత మహిళల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఆడపిల్లల పెళ్లిలు తల్లిదండ్రులకు భారం కాకుడదనే ఉద్దేశంతో కల్యాణలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చి, ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. వితంతులు, ఒంటరి మహిళలకు ఆసరా పింఛన్‌ను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ అనుదీప్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగారం, నాయకుడు వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నారాయణఖేడ్‌లో..
నారాయణఖేడ్, ఫిబ్రవరి 26: పట్టణంలోని వక్ఫ్ బోర్డు స్థలాల్లో ఉన్న దుకాణాలపై ఎవరి పెత్తనం చెల్లదని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సూచించారు. సర్పంచ్ ఎంఏ.నజీబ్ కుట్ర పన్నిన ఘటన వెలుగు చూడడంతో శనివారం ఎమ్మెల్యే రాజీవ్చౌక్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణఖేడ్‌కు చెందిన కొందరు వక్ఫ్ బోర్డు స్థలంలోని దుకాణాలకు అద్దె వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఎవరికీ అద్దె కట్టాల్సిన అవసరం లేదన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించేదుకు తాను కృషి చేస్తానని, వక్ఫ్ బోర్డు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యేతో మాజీ సర్పంచ్ ఎంఏ.నజీబ్ తదితరులు పాల్గొన్నారు.