రోజురోజుకూ విస్తరిస్తూ జనాభా వృద్ధి చెందుతున్న సిద్దిపేట పట్టణంలో అంతకంతకూ ట్రాఫిక్ సమస్య పెరుగుతున్నది. నిత్యం కొత్త వాహనాలు పట్టణ రోడ్లపైకి వస్తున్నాయి. అనేక ప్రాంతాల నుంచి నిత్యం వందలాది వాహనాలు వస్తుంటాయి. సిద్దిపేట పట్టణంలో పలుచోట్ల ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ఆరు నెలల నుంచి పనిచేయడం లేదు.
దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తి వాహనదారులతోపాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని విక్టరీ చౌరస్తా, పాత బస్టాండ్ వద్ద ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నా, సిగ్నల్న్ పని చేయడం లేదు. దీంతో కొందరు వాహనదారులు అడ్డదిడ్డంగా వాహనాలు నడుపుతుండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికేనా పోలీస్ అధికారులు స్పందించి ట్రాఫిక్ సిగ్నల్స్ పని చేసేలా చేసి ట్రాఫిక్‌ను నియంత్రించాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.
– నమస్తే తెలంగాణ స్టాఫ్ ఫొటోగ్రాఫర్ సిద్దిపేట, డిసెంబర్ 24