చేర్యాల, మార్చి 30: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాల 11వ ఆదివారానికి వివిధ జిల్లాల నుంచి భారీగా భక్తులు తరలిరానున్నారు. 60వేలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆలయ ఈవో బాలాజీ తెలిపారు. భక్తులు మల్లన్నను దర్శించుకోవడంతో పాటు పట్నం వేసి బోనం సమర్పించుకోనున్నారు.
మహామండపం, గంగరేగు చెట్టు ఆవరణతో పాటు బసచేసిన గదుల వద్ద పట్నాలు వేస్తారు. మల్లన్న గుట్టపైన ఎల్లమ్మకు బోనం చేసి మొక్కులు చెల్లించుకుంటారు. మల్లన్న క్షేత్రంలో మొక్కుల అనంతరం కొండపోచమ్మ, నల్లపోచమ్మ ఆలయాలకు వెళ్లి అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. భక్తుల కోసం ఆలయ ఈవో బాలాజీ, ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి, కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.