దుబ్బాక, జనవరి 31 : గ్రామాభివృద్ధితోపాటు ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన సర్పంచుల సేవలు మరువలేనివని ఎంపీపీ కొత్త పుష్పలతాకిషన్రెడ్డి, జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి అన్నారు. సర్పంచుల పదవీకాలం ముగియడంతో బుధవారం దుబ్బాక ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని సర్పంచులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి సర్పంచులు చేసిన సేవలు అభినందనీయమన్నారు. గ్రామాల్లో ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు ఇలా ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. నిస్వార్థంతో సేవలందించిన ప్రజాప్రతినిధులుగా సర్పంచులు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోతారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో భాస్కరశర్మ, పంచాయతీరాజ్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు చంద్రశేఖర్‌రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ జ్యోతీకృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ కైలాస్, వైస్ ఎంపీపీ రవి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రొట్టే రాజమౌళి, బనాల శ్రీనివాస్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
మద్దూరు(ధూళిమిట్ట), జనవరి 31 : ధూళిమిట్టను మండలంగా ఏర్పాటు చేసిన మాజీ సీఎం కేసీఆర్‌కు గ్రామస్తులు రుణపడి ఉంటారని సర్పంచ్ దుబ్బుడు దీపికావేణుగోపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం ధూళిమిట్ట సర్పంచ్‌తోపాటు ఉపసర్పంచ్ పోతరాజుల మధు, వార్డు సభ్యులను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మండలాన్ని ఏర్పాటు చేసి ధూళిమిట్ట ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గ్రామంలో సుమారు రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్బీఐ మేనేజర్ జ్ఞానేందర్, పంచాయతీ కార్యదర్శి రాజు, మాజీ జడ్పీటీసీ నాచగోని పద్మావెంకట్గౌడ్, మాజీ సర్పంచులు సాంబరాజు సీతారామరావు, రచ్చ లక్ష్మయ్య, సుద్దాల రేణుకానర్సింహులు, నాచగోని పద్మాలక్ష్మణ్గౌడ్, రిటైర్డ్ సీఈవో మాధవరెడ్డి, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కొమురవెల్లి, జనవరి 31 : గ్రామాభివృద్ధి కోసం సర్పంచులు చేసిన కృషి ఎనలేనిదని ఎంపీపీ తలారి కీర్తనాకిషన్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కా ర్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన సర్పంచులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల కృషి మరువలేనిదన్నారు. సర్పంచులను సన్మానించడంతోపాటు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమం లో జడ్పీటీసీ సిద్ధప్ప, ఎంపీడీవో అనురాధ, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సిబ్బంది పాల్గొన్నారు.
హుస్నాబాద్ రూరల్, జనవరి 31 : మండలంలోని పందిల్ల గ్రామంలో బుధవారం ఎస్‌హెచ్‌జీ మహిళా గ్రూప్ ఆధ్వర్యంలో సర్పంచ్ తోడేటి రమేశ్‌కు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఐదేండ్లలో గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశానన్నారు. గ్రామాభివృద్ధికి సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సర్పంచ్‌ను శాలువాలు, పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
రాయపోల్, జనవరి 31 : గ్రామాల్లో సర్పంచులు చేసిన సేవలు మరువలేవని ఎంపీపీ కల్లూరి అనితాశ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఆధ్వర్యంలో సర్పంచులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదవులు ఎప్పటికీ శాశ్వతం కాదని, మనం చేసిన పనులే మనకు గుర్తింపునిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీవో మున్నయ్య, ఎంపీడీవో లక్ష్మీనారాయణ, కో-ఆప్షన్ సభ్యులు పర్వేజ్, సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదరర్శులు తదితరులు పాల్గొన్నారు.
తొగుట, జనవరి 31 : సర్పంచుల సేవలు మరువలేనివి ఎంపీపీ లతానరేందర్‌రెడ్డి అన్నారు. మండ ల కేంద్రంలో ఎంపీపీ అధ్యక్షతన సర్పంచులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచుల సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీధర్, తహసీల్దార్ శ్రీకాంత్, సొసైటీ చైర్మన్ హరికృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొమురయ్య, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
దుబ్బాక, జనవరి 31 : తెలంగాణ అభివృద్ధిలో సర్పంచులు కీలక పాత్ర పోషించారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సర్పంచుల పదవీ కాలం ముగియడంతో బుధవారం దుబ్బాక విలేకరులతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నూతన పంచాయతీరాజ్ చట్టానికి రూపకల్పన చేసి గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేశారని తెలిపారు. కేసీఆర్ అడుగుజాడల్లో సర్పంచులు నడిచి అభివృద్ధిలో భాగస్వాములయ్యారని గుర్తుచేశారు. పదవులు ఉన్నా.. లేకున్నా ప్రజల్లో ఉన్నవారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. దుబ్బాక నియోజకవర్గ ప్రజల తరఫున సర్పంచులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.