కొండపాక(కుకునూరుపల్లి), జూలై 31 : దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం ఐనాపూర్ శివారులో తపాస్‌పల్లి రిజర్వాయర్ నిర్మించారు. కొండపాక మం డలంలోని పలు గ్రామాలకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేయాలని సంకల్పించిన తెలంగాణ తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కొం డపాక మండలంలోని 11వేల ఎకరాలకు సాగు నీరు అందించమే లక్ష్యంగా సమారు రూ.50 కోట్లు ఖర్చుచేసి డీ4కెనాల్ ఏర్పాటు చేయించారు.
కొండపాక మండల కేంద్రంతో పాటు మం డలంలోని తిమ్మారెడ్డిపల్లి, సిరిసినగండ్ల, గిరాయిపల్లి, మర్పడగ, ఖమ్మంపల్లి, రాంపల్లి, దుద్దెడ, అంకిరెడ్డిపల్లి, బందారం మీదుగా సిద్దిపేట రూరల్ మండలంలోని మరి కొన్ని గ్రామాలకు సాగునీరు అందించేందుకు కృషి చేశారు. నాటి సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా కొండపాక మండలంలోని ఎనిమిది గ్రామాలకు సాగునీరు అందింది కానీ నేడు నీళ్లు లేక డీ4 కెనాల్ వెలవెలబోతున్నది.
చేర్యాలకు చెందిన కొంత మంది కాంగ్రెస్ నాయకులు డీ4 కెనాల్లో మట్టిపోసి కొండపాక మండలానికి నీళ్లు రాకుండా అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న భారత జాగృతి రాష్ట్ర కార్యదర్శి అనంతుల ప్రశాంత్ రైతులతో కలిసి తన సొంత ఖర్చులతో కెనాల్లో మట్టిని తొలిగించడంతో పాటు కొండపాక మండల రైతులకు సాగునీరు అందించాలని నీటి పారుదలశాఖ అధికారులకు వినతి పత్రం అందజేసినా ‘నేటికీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న చందంగా తయారైంది. సాగునీరు అందక నాడు సాగు చేసిన భూములు నేడు బీడు గా మారాయి.
కొండపాక(కుకునూరుపల్లి), జూలై 31: గు లాబీ అధినేత కేసీఆర్ డీ4 కెనాల్ నిర్మించి వ్య వసాయరంగాన్ని సస్యశ్యామలం చేయించా రు. నీటికి కొదవ లేకుం డా రైతులు పంటలు పండిస్తూ సంతోషంగా జీవనం కొనసాగించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని నిర్ల క్ష్యం చేసింది. మొన్నటి దాకా ఎటు చూసినా పచ్చని పంటలతో విలసిల్లిన భూములు నేడు బీడుగా మారాయి. ప్రభుత్వం వెంటనే డీ4కెనాల్ ద్వారా కొండపాక మండల రైతాంగానికి సాగునీరు అందించాలి.
-సున్నం భాస్కర్, రైతు, తిమ్మారెడ్డిపల్లి, సిద్దిపేట జిల్లా
కొండపాక(కుకునూరుపల్లి), జూలై 31: వ్యవసాయరంగాన్ని మరిం త ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రభుత్వం సాగునీటిని అందించకుండా మొద్దునిద్ర పోతున్నది. కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు డీ4 కెనాల్ ద్వారా కొండపాక మండలంలోని అనేక గ్రామాలకు సాగునీరు అందింది. ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడి పోశాయి. గిప్పుడు వానకాలంలో కూడా చెరువులో నీళ్లు లేవు. రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకొని డీ4 కెనాల్ ద్వారా సాగునీరు అందిం చి రైతాంగాన్ని ఆదుకోవాలి.
– జిర్రా రాజు, రైతు, ఖమ్మంపల్లి, సిద్దిపేట జిల్లా
సిద్దిపేట, జూలై 31: నాకు నాలుగు ఎకరాల పొలం ఉన్నది. గతంలో రంగనాయకసాగర్ ద్వారా కుడి కాలువకు నీళ్లు వదలడంతో నాలుగు ఎకరాలు మొత్తం పారింది. ఎంత కరువు ఉన్నా కాలువ నీళ్లతో పొలం పారించుకున్నాం. ఇప్పుడు రంగనాయకసాగర్‌లో నీళ్లు లేక సగం పొలం బీడుగా మారింది. ప్రభుత్వం వెంటనే గోదావరి జలాలతో రంగనాయకసాగర్‌ను నింపి కాలువలకు నీటిని వదిలి రైతులను ఆదుకోవాలి.
– చింతల పరశురాములు, రైతు, గుర్రాల గొంది, సిద్దిపేట జిల్లా
సిద్దిపేట, జూలై 31: రంగనాయకసాగర్ ఎడమ కాలువ నీటి మీద ఆధారపడి ప్రతి సంవత్సరం నాటు వేసిది. నాకున్న ఎకరం 20 గుం టల పొలం మొత్తం పారేది. ఎడమ కాలువలో ఎప్పుడూ నీళ్లు ఉం టుండే. ఇప్పుడు రంగనాయక సాగర్ ప్రాజెక్టులోనే నీళ్లు లేవు. పొలా లు నాట్లు వేయడం ఆలస్యమవుతున్నది. కేసీఆర్ ప్రభుత్వం లాగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రంగనాయకసాగర్‌ను కాళేశ్వరం నీటితో నింపాలి. ఎడమ కాలువకు నీళ్లు వదిలితేనే పంటలు పండుతాయి. సాగునీటి కోసం రైతులను ఇబ్బంది పెట్టరాదు.
– శ్రీనివాస్, రైతు, చంద్లాపూర్, సిద్దిపేట జిల్లా
సిద్దిపేట, జూలై 31: రంగనాయకసాగర్ ఎడమ కాలువ నీళ్లు మా పొలానికి ఆధారం. ఇప్పుడు నీళ్లు లేక కాలువలు పారడం లేదు. గతంలో పొలం మొత్తం వరినాటువేశా. ఇప్పుడు నీళ్లు లేక బీడుగానే ఉన్నది. పొలం దున్నేందుకు ఇబ్బందిగా మారింది. వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రంగనాయకసాగర్ నిండుకుండలా ఉండేది. అప్పటి లాగానే ఇప్పు డు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నీళ్లు ఇవ్వాలి.
– మిద్దెల రమేశ్, రైతు, చంద్లాపూర్, సిద్దిపేట జిల్లా
తొగుట, జూలై 31: సరైన వర్షాలు లేక భూగర్భ జలమట్టం తగ్గింది. బోర్లు తక్కువగా నీళ్లు పోస్తున్నాయి. చాలా మంది రైతులు వరినాట్లు వేయలేదు. మల్లన్నసాగర్ ప్రాజెక్టులోకి వెళ్లే కాలువ నుంచి చెరువు, కుంటల్లోకి ప్రభుత్వం నిటిని విడుదల చేస్తే చెక్‌డ్యామ్‌లు నిండి రైతులకు న్యాయం జరుగుతది. కాళేశ్వరం జలాలను వదిలేందుకు ప్రభు త్వం మందుకొచ్చి రైతులను ఆదుకోవాలి.
– పిట్ల స్వామి, కన్గల్, తొగుట మండలం, సిద్దిపేట జిల్లా
వర్గల్, జూలై 31: రామాయంపేట కెనాల్‌కు నీళ్లు విడుదల చేయాలి. గత సంవత్సరం ఈపాటికే నాట్లు దగ్గర పడేది. ఈయేడు కాలం సక్కగ కాకపాయే. చెరువులు, కుంటల్లో నీళ్లు పారడం లేదు. తలాపునే కొండపోచమ్మసాగర్ ఉన్నా కాల్వల్లో సుక్కనీళ్లు లేవు. వానకాలం వచ్చినా మొగులు సూసుడవుతున్నది.రామాయిపేట కాల్వల్లో నీళ్లులేక తుంగమొలుస్తున్నది. ప్రభుత్వం స్పందించి రైతులకోసం నీళ్లు విడుదల చేయాలి.
– కాగిరంగుల సుదర్శన్‌రెడ్డి, రైతు, సింగాయిపల్లి, వర్గల్ మండలం, సిద్దిపేట జిల్లా