పటాన్చెరు, సెప్టెంబర్ 2: అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందున్నదని, సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో గ్రామ స్వరాజ్యం సాధ్యమైందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పలు గ్రామాల పరిధిలో రూ.2 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అంతర్గత మురుగునీటి కాల్వలు, మహిళా సమాఖ్య భవనం తదితర పనులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. కర్ధనూర్, నందిగామ, భానూర్, ఇస్నాపూర్ గ్రామాల్లో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన వైకుంఠ రథాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధికి మారుపేరులా పటాన్చెరు నియోజకవర్గంలోని గ్రామాలు కనిపిస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
‘ఇంటి ముంగిట అభివృద్ధి- ఇంట్లో సంక్షేమం’ అనే నినాదంతో ముందుకు పోతున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఇప్పుడు అన్ని రాష్ర్టాలు మన పథకాలను అనుసరిస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలు పనిచేస్తున్న వారివెంటే ఉంటారన్నారు. వైకుంఠరథాలు ఇవ్వడంతో పాటు అంత్యక్రియలకు ఇబ్బందులు రాకుండా ఫ్రీజర్లు కూడా ఇచ్చిన దాతలను ఎమ్మెల్యే అభినందించారు. నియోజకవర్గంలో పరిశ్రమలు, రియల్టర్లు, ఐటీ ఉద్యోగులు సేవాభావంతో అనేక పనులకు సహకరిస్తున్నారని ఎమ్మెల్యే వారిని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ సుష్మాశ్రీవేణుగోపాల్రెడ్డి, జడ్పీటీసీ సుప్రజావెంకట్‌రెడ్డి, సర్పంచ్‌లు మున్నూరు లక్ష్మయ్య, కావ్యకాశిరెడ్డి, శ్రీనివాస్, గడ్డంబాలామణిశ్రీశైలం, భాగ్యలక్ష్మీ, ఎంపీటీసీలు గోల్కొండ నాగజ్యోతి లక్ష్మణ్, అంజిరెడ్డి, ఉప సర్పంచ్‌లు కృష్ణయాదవ్, వడ్డేకుమార్, శోభాకృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బీ.పాండు, సీనియర్ నాయకులు దశరథరెడ్డి, బీ.వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
ahead in development