సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 5: మన సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత గురువులనే దైవంగా భావిస్తామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాం తి అన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జిల్లాస్థాయిలో ఉత్త మ ఉపాధ్యాయులకు పురస్కారాలు ప్రదానం చేశా రు. ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అ నంతరం కలెక్టర్ మాట్లాడుతూ సర్వేపల్లి జయంతి సం దర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించుకోవడం సంతోషకరమన్నారు.
విద్యార్థులకు మంచి చెడులు నేర్పించి చీకటి నుంచి వెలుగులోకి పయనించేలా తీర్చిదిద్దేది గురువులే అని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విలువలతో కూడిన విద్య ను నేర్పించాలన్నారు. ఉపాధ్యాయులు కేవలం పాఠా లు బోధించడమే కాకుండా సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. బడీడు పిల్లలను బడిలో చేర్పించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉన్నదన్నారు. జిల్లా కలెక్టర్‌గా ఉన్నతస్థానంలో నిలబెట్టిన ఉపాధ్యాయులను గుర్తుచేసుకుంటూ ఈ సందర్భంగా కలెక్టర్ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వామి వివేకానంద చెప్పినట్లు దేశ భవిష్యత్తు తరగతి గదిలోని నాలుగు గోడల మధ్యనే నిర్మించబడుతుందని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు.
అనంతరం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 121 మంది ఉపాధ్యాయులను శాలువా, మెమోంటోలతో సన్మానించారు. కార్యక్రమంలో టీజీఐఐసీసీ చైర్పర్సన్ నిర్మలాజయప్రకాశ్రెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సంజీవరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఈవో వెంకటేశ్వర్లు, ఉత్తమ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.