పెద్దశంకరంపేట, అక్టోబర్ 14: మండల మాజీ జడ్పీటీసీ భూత్కూరి విజయరామరాజు కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని మాజీమంత్రి తన్నీ రు హరీశ్‌రావు అన్నారు. సోమవారం పెద్దశంకరంపేట మండలం మల్కాపురం గ్రామంలో విజయరామరాజు మృతి చెందడంతో ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంత్యక్రియల్లో మాజీమంత్రి పాల్గొని కుటుంబ సభ్యులను ఓదార్చారు. విజయరామరాజు ఇద్దరు కూతుళ్లను అన్నివిధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు.
విజయరామరాజు మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరనిలోటన్నారు. అంత్యక్రియల్లో ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్‌లు పాడె మేశారు. ఎమ్మెల్సీలు శేరి సుభాశ్‌రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు పద్మ దేవేందర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, శివకుమార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, మురళీపంతులు, అలుగుల సత్యనారాయణ, కోనం విఠల్, రాయిని మధు, నారాగౌడ్, ఆర్ఎన్ సంతోష్‌కుమార్, సంగమేశ్వర్, దత్తు, రమేశ్ తదితరులున్నారు.