సమ్మర్ హీట్ షురూ..
అప్పడే సమ్మర్ హీటెక్కిస్తోంది. ఉదయం నుంచే భానుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు.
- భానుడి ప్రతాపానికి ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు
- ఎండలతో నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదమే
- జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు
న్యాల్కల్, ఫిబ్రవరి 22: అప్పడే సమ్మర్ హీటెక్కిస్తోంది. ఉదయం నుంచే భానుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. అత్యవసరం అనుకుంటే ఉదయమే ప్రయాణమవుతున్నారు. ఇండ్లలో ఉండేవారు ఏసీలు, కూలర్లను పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు. మరికొంత మంది చెట్ల కింద సేద తీరుతున్నారు. ఈసారి ఎండలు మండే అవకాశం ఉన్నందున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వేసవిలో మంచినీరే దివ్య ఔషధమని చెబుతున్నారు. ఎండ వేడిమితో శరీరం నుంచి చెమట రూపంలో నీరు ఎక్కవగా బయటకు వెళ్లిపోతుంది. కాబట్టి వడదెబ్బ తగలకుండా, ఎండ నుంచి ఉపశమనం కోసం తగు జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందన్నారు. ఆహార పదార్థాలు వండేటప్పుడు నూనెలను తగ్గించాలి.
ఆకుకూరలు ఎక్కవగా తీసుకోవాలి. ఆవిరి కుడుములు ఇడ్లీలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచివి. కూల్‌డ్రింక్ కన్నా కొబ్బరి నీళ్లు తాగితే మంచిది. కాఫీ, టీ వీలైనంత తక్కువగా తాగితే మంచిది. కర్బుజా, నిమ్మరసం, గ్లూకోజ్ నీళ్లు, సగ్గుబియ్యం నానబెట్టిన నీళ్లను తాగితే మంచింది. మజ్జిగ అన్నం, ఇండ్లల్లో కిటికీలు తెరిచి గాలి వచ్చేలా ఉంచుకోవాలి. కిటికీలు, గుమ్మాలకు వట్టి వేళ్లతో, కొబ్బరి నారతో చేసిన తెరలను తడిపి కట్టుకుంటే వేడి ఇండ్లలోకి రాకుండా చల్లదనాన్ని ఇస్తాయి. వేసవిలో శరీరానికి అతుక్కొని, బిగుతుగా ఉండే దుస్తులను ధరించవద్దు. కాటన్‌తో తయారు చేసిన బట్టలను ధరిస్తే మంచిది. పగటి పూట బయటకు వెళ్లేటప్పుడు కళ్లకు చలువనిచ్చే అద్దాలు, టోపీలను ధరించడం మంచిది. ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఎండలో తిరిగితే త్వరగా డీహైడ్రేషన్‌కు గురై వ్యాధి తీవ్రతలు అధికమవుతాయి. ఆల్కహాల్, సిగరెట్, కార్బోనేటెడ్ వంటి ద్రావణాలకు దూరంగా ఉండడం మంచిది. వీటితో శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఉదయం, సాయంత్రం వేళల్లోనే దూరం ప్రాంతాలకు ప్రయాణం చేస్తేనే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎండాకాలం ప్రజలు కాస్తంత జాగ్రత్తలు పాటిస్తే వడదెబ్బ బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చని చెబుతున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

