నర్సాపూర్,అక్టోబర్21: బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం గచ్చిబౌలిలోని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఇంటికి వెళ్లారు. ఎమ్మెల్యేతో పాటు కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి , కుటుంబ సభ్యులు కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎమ్మెల్యే ఇచ్చిన తేనీటి విందును కేటీఆర్ స్వీకరించారు. వీరితో పాటు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీఆర్ఎస్ నాయకులు సంతోష్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.