వెల్దుర్తి, అక్టోబర్ 31: గ్రామాల్లో గులాబీ జాతర సాగుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి మంగళవారం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, అసంఘటిత కార్మిక సంక్షేమ సంఘం చైర్మన్ ఉమ్మన్నగారి దేవేందర్‌రెడ్డితో కలిసి మాసాయిపేట మండల పరిధిలోని రామంతాపూర్, లింగారెడ్డిపల్లి, రామంతాపూర్తండా, బొమ్మారం, నాగ్సాన్పల్లి, కొప్పులపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. మాసాయిపేటలో రుక్మిణీపాండురంగస్వామి, సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్యకర్తలతో కలిసి రామంతాపూర్ ప్రచారానికి వెళ్లారు. ఈ సందర్భంగా మహిళలు తిలకం పెట్టి మంగళహారతులతో ఘన స్వాగతం పలుకగా, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు క్రేన్ సహాయంతో భారీ గజమాల వేసి సత్కరించారు. మాసాయిపేట, రామంతాపూర్ గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన వచ్చిన మార్పులను గమనించాలని, ఆ మార్పు సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ద్వారానే సాధ్యమైందన్నారు.
అన్నివర్గాలను ఆదుకుంటూ, అండగా నిలుస్తున్నది బీఆర్ఎస్ అని, అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. చేసిన అభివృద్ధిని వివరిస్తూ మరోసారి కారుగుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, మూడోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. రామంతాపూర్తండాలో గిరిజన వేషధారణలో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి గిరిజన మహిళలతో కలిసి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జిల్లా కో-ఆప్షన్ మన్సూర్, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్, మాసాయిపేట, వెల్దుర్తి మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు మధుసూదన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఫకీరాగోపీనాయక్, శంకర్, పెంటయ్య, ఎంపీటీసీలు సోనిశ్రీనునాయక్, నవనీతాశ్రీను, మోహన్‌రెడ్డి, నాయకులు నాగరాజు, నర్సింలు, బాలేశ్, సిద్దిరాంలు, శ్రీనునాయక్, స్టేషన్శ్రీను, నర్సింహారెడ్డి, బాల్‌రెడ్డి, పడిగెనర్సింలు, ఆంజనేయులు, కృష్ణాగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, అశోక్‌గౌడ్, మహేశ్, నాగరాజు, గంగాధర్, శాఖారంశ్రీను, శ్రీధర్‌రెడ్డితోపాటు పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
మెదక్ ఎంపీ, దుబ్బాక నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం హేయమైన చర్య అన్ని బీఆర్ఎస్ నర్సాపూర్ అభ్యర్థి, మాజీ మహిళా కమిషన్ చైర్మన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం రామంతాపూర్‌లో ఆమె విలేకర్లతో మాట్లాడారు. రాజకీయాల్లో ఎన్నికలు రావడం, గెలుపు ఓటములు సహజమన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇలా హత్యాయత్నానికి ప్రయత్నించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రజలకు చేసిన సేవలే నాయకులు, ప్రజాప్రతినిధులకు గుర్తింపునిస్తాయని, వారి ఆశీస్సులే నాయకులకు అండ అన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్యాన్ని తీవ్రంగా కండిస్తున్నామని, వారు త్వరగా కోలుకొని మళ్లీ ప్రజాసేవలో కొనసాగాలని దేవుడిని ప్రార్థిసున్నట్లు తెలిపారు. విషయం తెలియగానే సోమవారం సాయంత్రం యశోద దవాఖానకు వెళ్లి కొత్త ప్రభాకర్‌రెడ్డిని చూసి, వారి కుటుంబసభ్యులను పరామర్శించామన్నారు.
శివ్వంపేట, అక్టోబర్ 31: మాసాయిపేట మండలంలో మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా శివ్వంపేట మండలం దంతాన్‌పల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, ఆత్మకమిటీ చైర్మన్ గొర్రె వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, బీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరి వీరేశం, కో-ఆప్షన్ సభ్యుడు లాయక్, పార్టీలో చేరిన వారు గొల్ల యాదగిరి, గొల్ల గోపాల్, గొల్ల నర్సింలు, నాంచారి ప్రకాశ్, కంచాన్పల్లి నర్సింలు, గేడి నాగరాజు, కన్నారం ప్రభాకర్, ఉప్పరి ప్రవీణ్, గజేంద్రుల శంకర్, గజేంద్రుల నర్సింలు తదితరులున్నారు.