శివంపేట : మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో విషాదఘటన చోటు చేసుకుంది. నాలుగవ తరగతి చదువుతున్న రాజిపేట శివతేజ్ ( Shivatej ) అనే విద్యార్థి ఓ దుకాణంలో ఎండాకాలం దృష్ట్యా చేతిలో పట్టుకునే చిన్న ఫ్యాన్ కలిగిన బ్యాటరీ ( Battery ) కొనుగోలు చేశాడు.
ఆ బ్యాటరీను ఉపయోగిస్తున్న సమయంలో అకస్మాత్తుగా పేలుడు ధాటికి ఏకంగా ఎడమ చేతి నాలుగు వేళ్లు తెగి తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడిని కుటుంబ సభ్యులు వెంటనే కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. నాణ్యత లేని బ్యాటరీల విక్రయంపై అధికారుల పర్యవేక్షణ అవసరమని ప్రజలు కోరుతున్నారు.