చేర్యాల, మార్చి 18: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ప్రసాదం పులిహోర బరువు, ధరలను ఇటీవల పెంచుతూ రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ ఆదేశాలు జారీచేశారు. ఆలయ పాలక మండలి తీర్మానం మేరకు దేవాదాయశాఖ అధికారులు ధరలు పెంచుతూ అనుమతి ఇచ్చా రు. దీంతో రెండువారాలుగా ఆలయవర్గాలు కొత్త ధరలను అమలు చేస్తున్నారు. లడ్డూ ప్రసాదం పరిమాణం, ధరను యధావిధిగా కొనసాగిస్తూ పులిహోర ధర పెంచారు. వీటితోపాటు మొక్కుబడులైన పట్నాలు, బోనం టికెట్ల ధరలు పెరిగాయి.
భక్తుల డిమాండ్ మేరకు..
కొంతకాలంగా 100 గ్రాముల పరిమాణం కలిగిన లడ్డూను ఆలయవర్గాలు రూ.20కు, 150 గ్రాముల పులిహోర రూ.15కు విక్రయిస్తున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో ప్రతి ఆదివారం 25వేలకు పైగా లడ్డూ, పులిహోర విక్రయం జరుగుతుండగా, ఉత్సవాలు లేని సాధారణ సమయంలో 10వేల మేరకు ప్రసాదాలు విక్రయం జరుగుతుందని ఆలయ రికార్డులను బట్టి తెలుస్తున్నది. భక్తులకు 150 గ్రాముల పులిహోర సరిపోవడం లేదనే డిమాండ్ రావడంతో ఆలయపాలక మండలి తీర్మానం మేరకు పులిహోర పరిమాణం 200 గ్రాములకు పెంచి ధరను రూ.20కు పెంచారు. లడ్డూ, పులిహోర క్వాలిటీతో పాటు నాణ్యతపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
చేర్యాల, మార్చి 18: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి బ్రహ్మోత్సవాల్లో నేడు 9వ (చివరి) ఆదివారంతో పాటు అగ్నిగుండాల కార్యక్రమం ఉండడంతో రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. వరంగల్, కరీంనగ ర్, మెదక్ తదితర పూర్వపు జిల్లాల నుంచి భ క్తులు అధిక సంఖ్యల రానున్నట్లు ఆలయ వర్గా లు తెలిపాయి. భక్తులకు ఆలయ పాలక మండ లి, ఆలయ సిబ్బంది సేవలందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం అన్ని వసతులు కల్పిస్తున్నామని మల్లన్న ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి తెలిపారు.
పట్నం, బోనం టిక్కెట్ల ధరల పెంపు
90 శాతం మంది భక్తులు పట్నాలు వేయించి స్వామివారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులు బసచేసిన ప్రదేశంలో చల్కపట్నం, గంగిరేగుచెట్టు ప్రాంగణంలో నజరుపట్నం, మహామండపంలో ముఖమండప పట్నం వేసి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. పాత ధరల ప్రకారం చల్క పట్నం టికెట్ ధర రూ.80, నజరు పట్నం రూ.100, ముఖమండప పట్నం రూ.200 అమలులో ఉన్నాయి. పెరిగిన ధర లు, ఒగ్గు పూజారుల వ్యయప్రయాసలను దృష్టిలో పెట్టుకొని వారి అభ్యర్థన మేరకు పాలకమండలి పట్నాల ధరలు పెంచేందుకు తీర్మానం చేయడంతో కమిషనర్ ధరల పెం పునకు అనుమతి ఇవ్వడంతో కొత్త ధరలు అందుబాటులోకి వచ్చా యి. కొత్త ధరల ప్రకారం చల్క పట్నం రూ. 80-100, నజరు పట్నం రూ.100-150, ముఖమండప పట్నం రూ.200-250, బోనం రూ.20-30కు పెరిగాయి. పట్నాల ధరలు పెరగడంతో ఒగ్గుపూజారులకు ప్రతిఫలం పెరగడంతోపాటు ఆలయానికి సైతం మరింత ఆదాయం సమకూరనున్నడడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.