చేర్యాల, జనవరి 5 : ఈ నెల 7వ తేదీన కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యే క పూజల వెండి తదితర సామగ్రిని ఆలయ అర్చకులు సిద్ధం చేశారు. ఆలయ అర్చకులు స్వామి వారి కల్యాణంలో ఉపయోగించే స్వర్ణ కిరీటం, కోరమీసాలు, ఖడ్గం, రుద్రాక్షమాల, స్వామి వారి నామాలు, పంచహారతి, రుద్రపాదం తదితర వెండి, పంచలోహ సామాగ్రికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన అనంతరం ఆలయవర్గాలు సిద్ధం చేశాయి.
స్వామి వారి కల్యాణోత్సవం మొదలుకొని ఏకాదశ రుద్రాభిషేకం, లక్షబిల్వార్చన తదితర పూజలకు సదరు సామగ్రి కీలకం కావడంతో ప్రతి ఏటా ఆలయవర్గాలు స్వామి వారి కల్యాణోత్సవం ముందు రోజుల్లో వాటిని శుభ్రం చేసి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.