సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రజాసేవ
మండలంలోని పోతంశెట్‌పల్లి చౌరస్తా నుంచి ఏడుపాయల వెళ్లే దారిలో మల్కాజిగిరి ఎమ్మె ల్యే మైనంపల్లి హన్మంత్‌రావు, ఆయన కుమారుడు డాక్టర్ రోహిత్‌రావుకు ఘనస్వాగతం లభించింది.
- మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
- పోతంశెట్‌పల్లి చౌరస్తాలో ఘనస్వాగతం
- కొర్విపల్లిలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు
కొల్చారం, ఫిబ్రవరి 19 : మండలంలోని పోతంశెట్‌పల్లి చౌరస్తా నుంచి ఏడుపాయల వెళ్లే దారిలో మల్కాజిగిరి ఎమ్మె ల్యే మైనంపల్లి హన్మంత్‌రావు, ఆయన కుమారుడు డాక్టర్ రోహిత్‌రావుకు ఘనస్వాగతం లభించింది. ఆదివారం ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి వెళ్తూ మార్గమధ్యలో పోతంశెట్‌పల్లి చౌరస్తాలో ఆగారు. గౌడ సంఘం మండలాధ్యక్షుడు నాయిని వెంకట్‌గౌడ్, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి తదితరు లు భారీ గజమాలతో ఎమ్మెల్యేను సన్మానించారు. హన్మంతరావు తన కుమారుడు రోహిత్‌ను కొల్చారం మాజీ జడ్పీటీసీ ఎనగండ్ల మొగులయ్యకు పరిచయం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తన కుమారుడు మెడిసిన్ పూర్తి చేసి, సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ద్వారా మెదక్ నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో ప్రజలకు సేవ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మెదక్ మార్కెట్ కమిటీ వైస్చైరపర్సన్ సావిత్రిరెడ్డి, నాయకులు ముత్యంగారి సంతోశ్‌కుమార్, కొరబోయిన కాశీనాథ్, చిట్యా ల యాదయ్య, తుక్కాపూర్ ఆంజనేయులు, సోమ నర్సింహు లు, సాయిని సిద్ధ్దిరాములు, గడ్డమీది నర్సింహులు, సురేశ్‌గౌడ్, శ్రీకాంత్, ఏడుపాయల మాజీ డైరెక్టర్ గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత
చిన్నశంకరంపేట, ఫిబ్రవరి 19 : ఆధ్యాత్మికత తోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తెలిపారు. కొర్విపల్లిలో కుమారుడు రోహిత్‌తో కలసి దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చిన్నశంకరంపేటలో సోమేశ్వరాలయ వార్షికోత్సవాల్లో పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గ ప్రజలకు తన కుమారుడు రోహిత్ అందుబాటులో ఉంటా రని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గంగానరేందర్, సర్పంచ్ రాజారెడ్డి పద్మ, మాజీ సర్పంచ్ మైనంపల్లి రంగారావు , నాయకులు మల్లేశం, జీవన్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

