సంగారెడ్డి, జూన్ 20: దేశవ్యాప్తంగా జూలై ఒకటి నుంచి అమలుకానున్న నూతన చట్టాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేశ్ అన్నారు. గురువారం పోలీ సు కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను ప్రారంభించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నూతన చట్టాలను ఎస్‌హెచ్‌వోలు, పోలీసు అధికారులు తెలుసుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా అమలుకానున్న కొత్త చట్టాలను అనుసరిస్తూ ముందుకు సాగాలన్నారు.
ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని సెక్షన్లపై పూర్తి అవగాహన అవసరమని, అప్పుడే బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులపై ఏఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి, అరెస్ట్, వాంగ్మూలం నమోదులో పాటించవలసిన జాగ్రత్తలు, చార్జిషీట్ ఎలా తయా రు చేయాలి అనే విధానాలపై అవగాహన వస్తుందన్నారు. నిందితులకు శిక్షలు ఖరారు చేయడంలో దర్యాప్తు అధికారులు వ్యవహరించాల్సిన తీరు, తదితర అంశాలపై కొత్త చట్టంలో మార్పులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్ డీఎస్పీలు సత్తయ్యగౌడ్, రవీందర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ శివలిం గం, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేశ్, ఎస్‌హెచ్‌వోలు తదితరులు పాల్గొన్నారు.