సంగారెడ్డి, ఫిబ్రవరి 13: సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ అడ్మిస్ట్రేషన్ అశోక్ రాచకొండ ఎస్వోటీ డీసీపీగా బదిలీపై వెళ్లారు. డీటీసీ అదనపు ఎస్పీగా పనిచేస్తున్న రాములు నాయక్ నల్లగొండ అడ్మిస్ట్రేషన్ అదనపు ఎస్పీగా బదిలీ అయ్యారు. ఏపీపీ, ఎస్డీపీవోలు, డీఎస్పీలకు రాష్ట్ర ప్రిన్సిపల్ కార్యదర్శి జితేందర్ బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు. డీటీసీలో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ రవీందర్‌రెడ్డిని పటాన్‌చెరుకు, పటాన్చెరు ఏసీపీ పురుషోత్తంరెడ్డిని మల్కాజిగిరి రాచకొండకు బదిలీ చేశారు. జహీరాబాద్ ఏసీపీ రఘు సివిల్ డీఎస్పీగా బదిలీపై వెళ్లనున్నారు. జహీరాబాద్ డీఎస్పీగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి బదిలీపై రానున్నారు. డీసీఆర్బీ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న బాలాజీని ఏసీపీ గజ్వేల్‌కు బదిలీ చేశారు. సంగారెడ్డి ఎస్డీపీవోగా పని చేస్తున్న రమేశ్‌కుమార్‌ను హైదరాబాద్ సీఎస్‌డబ్ల్యూ ఏసీపీగా బదిలీ చేశారు. సీఐడీ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న సత్తయ్య సంగారెడ్డి ఎస్డీపీవోగా బదిలీపై రానున్నారు.
సంగారెడ్డి అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ రఘురామ్ సీపీఅండ్ఈ డీసీ హెడ్‌క్వార్టర్స్‌కు బదిలీ అయ్యారు. సంగారెడ్డి ఎస్‌హెచ్‌వో మధుబాబును ధూల్‌పేట్-1 ఎస్‌హెచ్‌వోగా బదిలీ చేశారు. కొండమడుగులో సీపీ నందిని, ఓడీ ఐఎంఎల్ డిపోలో విధులు నిర్వహిస్తున్న ఎండీ నజీర్ పాషాను సంగారెడ్డి ఎస్హెచ్వోలుగా నియమించారు. ఏపీ మెటల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ ఐడీఏ బొల్లారంలో విధులు నిర్వహిస్తున్న శిరీషను హైదరాబాద్ డీటీఎఫ్‌కు బదిలీ చేశారు. నారాయణపేట్ ఎస్‌హెచ్‌వోగా పనిచేస్తున్న కవిత ఏపీ మెటల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ ఐడీఏ బొల్లారానికి బదిలీ అయ్యారు. పటాన్చెరు ఎస్‌హెచ్‌వోగా విధులు నిర్వహిస్తున్న సీతారాంరెడ్డిని ఇబ్రహీంపట్నం ఎస్‌హెచ్‌వోగా, డీటీఎఫ్ నాగర్‌కర్నూల్‌లో పనిచేస్తున్న పరమేశ్వర్గౌడ్ను పటాన్‌చెరుకు బదిలీ చేశారు. జహీరాబాద్ ఎస్‌హెచ్‌వోగా పనిచేస్తున్న అశోక్‌కుమార్‌ను నారాయణపేట ఎస్‌హెచ్‌వోగా, అందోల్‌లో పనిచేస్తున్న సుబ్రహ్మణ్యాన్ని సీపీ కృష్ణ-1కు బదిలీ చేశారు. జహీరాబాద్ సీపీగా ఉన్న భిక్షారెడ్డిని హైదరాబాద్ ఎస్టీఎఫ్కు, ఆన్హెన్సర్ బేవరీస్లో పనిచేస్తున్న సునీతను యూఎస్‌కే నాచారానికి బదిలీ చేశారు. హైదరాబాద్ ఎస్టీఎఫ్ నుంచి మోహన్‌బాబును ఏపీ మెటల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ ఐడీఏ బొల్లారానికి బదిలీ చేశారు. ఎంఎల్ డిపో రంగారెడ్డి-1 నుంచి సాగర్‌రెడ్డిని అందోల్ ఎస్‌హెచ్‌వోగా, వైనడిల్ డిస్టిల్లరీస్ ఓడీ క్రౌన్ బీర్స్లో విధులు నిర్వహిస్తున్న నీరజాదేవిని పరిగి ఎస్‌హెచ్‌వోగా బదిలీ చేశారు.