కోహెడ, ఏప్రిల్ 23: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన భూభారతి చట్టంతో రైతుల భూసమస్యలు సులభంగా పరిష్కరించుకోవచ్చని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం కోహెడ మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. కోహెడలో అప్పయ్యగుడి నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం తలారి చంద్రయ్య ఇంట్లో సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు.
అనంతరం కోహెడలో కుర్మసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత కోహెడ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో మాట్లాడుతూ.. ప్రతి ఊరికి ఒక వీఆర్వోవోను నియమిస్తామని తెలిపారు. ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలోనే భూసమస్యలు పరిష్కరించేలా చట్టం చేసినట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ మనుచౌదరి, అదనపు కలెక్టర్ హమీద్ అన్సారీ భూభారతిపై రైతులకు అవగాహన కల్పించారు.
కార్యక్రమాలలో ఆర్డీవో రామ్మూర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, ఏఎంసీ చైర్పర్సన్ బోయిని నిర్మలాజయరాజ్, వైస్ చైర్మన్ భీంరెడ్డి తిరుపతిరెడ్డి, నాయకులు మంద ధర్మయ్య, బొమ్మ శ్రీరామ్చక్రవర్తి, మంద పవన్, కర్ణకంటి మంజులారెడ్డి, దొమ్మాట జగన్రెడ్డి, బస్వరాజు శంకర్, తడిసిన రవీందర్రెడ్డి, కర్ర రవీందర్, కోనే శేఖర్, భీంరెడ్డి మల్లారెడ్డి, తహసీల్దార్ సురేఖ, వివిధ శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు