Farmers | జనరేటర్‌కు ఒక్క రోజుకే రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. హరీశ్ రావుతో రైతు ఆవేదన
Farmers | కరెంట్ 3- 4 గంటలు మాత్రమే వచ్చింది. ఒక్క రోజు జనరేటర్ తీసుకొస్తే రూ.4 వేలు కిరాయి..రూ.3 వేలు డీజిల్ ఖర్చు.. అలా 3 రోజులు పెట్టినం..వరి ఎండిపోతుంది.. ఆశకు తినేందుకైనా మిగులుతయనుకున్నం.. చేసేదేమి లేక మళ్లీ తిరిగిచ్చేసినమని ఓ రైతు మాజీ మంత్రి హరీశ్ రావుతో తన గోడు వెళ్లబోసుకున్నారు.
Farmers | సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బూరుగుపల్లిలో ఎండిపోయిన పంటలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు పరిశీలించారు. రైతులకు కరెంట్ ఎలా వస్తుంది.. సాగునీరు పారుదల ఎలా ఉందనే విషయాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఓ రైతు మాట్లాడుతూ.. మూడెకరాలు నాటేసినం సార్.. కరెంట్ సరిగా లేకపోవడంతో బోరు కాలిపోయింది. బోరు తీయించి కొత్త పంప్ పెట్టిన తర్వాత కరెంట్ 3- 4 గంటలు మాత్రమే వచ్చింది. ఒక్క రోజు జనరేటర్ తీసుకొస్తే రూ.4 వేలు కిరాయి..రూ.3 వేలు డీజిల్ ఖర్చు.. అలా 3 రోజులు పెట్టినం.. రోజుకు మొత్తం రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. వరి ఎండిపోతుంది.. ఆశకు తినేందుకైనా మిగులుతయనుకున్నం.. చేసేదేమి లేక మళ్లీ తిరిగిచ్చేసినమన్నారు.
సత్యనారాయణ అనే రైతు మాట్లాడుతూ.. నేను ఆరెకరాలు నాటేసిన. అంతకు ముందు లోవోల్టేజీతో మోటార్ కాలిపోయింది.. మాకేం తెలుసు.. ట్రాన్స్ఫార్మర్ ఫిట్టింగ్ చేస్తే మోటారు బాగుందనుకుంటే అది కూడా కాలిపోయింది.. ఏందన చూస్తే ట్రాన్స్ఫార్మర్ మీద 2 ఫేజ్‌లు ఫుల్ వస్తుంది.. ఒక ఫేజ్ డౌన్ చూపిస్తుంది.. ఆరెకరాల్లో మూడెకరాలు పోయింది. రెండుసార్లు మోటార్లు కాలిపోయింది. లైన్మెన్ను అడిగితే.. మేమేం చేయాలే.. మొదటి నుంచే అట్లా వస్తుందని వాపోయాడు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బూరుగుపల్లిలో ఎండిపోయిన పంటలను పరిశీలించిన హరీష్ రావు https://t.co/rOVRdutBwr
— Telugu Scribe (@TeluguScribe) October 22, 2026
Read Also :
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | జనరేటర్‌కు ఒక్క రోజుకే రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. హరీశ్ రావుతో రైతు ఆవేదన
Sanju Samson: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
Allu Arjun | చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం రజినీకే సాధ్యం.. ‘జైలర్ 2’పై అల్లు అర్జున్ ప్రశంసల జల్లు!
Ranabaali | ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడంటే?
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

