సిద్దిపేట అర్బన్, నవంబర్ 1: ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కన్వెన్షన్ హాల్లో జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బందికి సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల నిపుణులతో ఉచిత ఆరోగ్య సూచనలు, సలహాలు, చికిత్సపైన అవగాహన సదస్సు నిర్వహించారు. బ్లడ్, యూ రిన్, బీపీ, షుగర్, హార్ట్ ఎటాక్, ఒత్తిడికి లోనవ్వడం వంటి తదితర అంశాలపై వైద్యు లు అవగాహన కల్పించారు. ఈ మేరకు 325 మంది పోలీస్ అధికారులు, సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విడతల వారీ గా జిల్లాలోని హోంగార్డు నుంచి ఉన్నతాధికారి వరకు చికిత్సలు నిర్వహిస్తామన్నారు. రెండేండ్ల పాటు వారి ఆరోగ్య పరిరక్షణ గురించి డాక్టర్ల పర్యవేక్షణ ఉంటుందన్నారు. మంత్రి హరీశ్‌రావు సహకారంతో, సీపీ శ్వేత సూచన మేరకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాను పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని జిల్లా పోలీసులు, సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అనంతరం సిద్దిపేట వైద్య కళాశాల ప్రొఫెసర్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ వైద్యరంగంలో ఎంతో టెక్నాలజీ వచ్చిందని, ఎంతటి జబ్బునైనా నయం చేయవచ్చన్నారు. ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లో ఉం టుందని, మన జీవన శైలిని బట్టి జబ్బులు వస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, వ్యాయా మం చేయడం, మంచి ఆహారం తీసుకోవడం వంటి సూత్రాలు పాటించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీపీసీ ఏఆర్ రామచంద్రరావు, సిద్దిపేట ఏసీపీ దేవారెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ రఘుపతిరెడ్డి, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ గురుస్వామి, మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గౌతమ్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.