దుబ్బాక, జూన్ 2 : పెండ్లి బాజా మోగింది..! రెండు నెలల్లో వివాహ ముహుర్తాలు అధికంగా ఉండడంతో చాలా జంటలు ఒక్కటి కానున్నా యి. జూన్, జూలై నెలల్లో అత్యధిక ముహూర్తాలు ఉన్నా యి. పెండ్లిల సీజన్‌తో వస్త్ర, ఆభరణాల, కిరాణా దుకాణాలు రద్దీగా మారాయి.
రాష్ట్రంలో సుమారు 50 వేలకు పైగా వివాహాలు..
రెండేండ్లుగా కరోనా కారణంగా పెండ్లిలు, ఇతర శుభకార్యాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. 2022 సంవత్సరంలో మార్చి, అక్టోబర్, నవంబర్ నెలల్లో ముహూర్తాలు లేవు. జూన్, జూలై నెలల్లోఅత్యధిక ముహూర్తాలు ఉన్నాయి. రాష్ట్రంలో 50 వేలకు పైగా వివాహాలు జరుగనున్నట్లు బ్రాహ్మణులు, వేదపండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో సుమారు 5 వేల వివాహాలు జరిగే అవకాశం ఉం దని తెలిపారు.
సందడిగా మారిన ఫంక్షన్‌హాళ్లు..
గతంలో వివాహాలు ఇంటి ముందు, ఆలయాల్లో మాత్రమే జరిగేవి. మారుతున్న కాలంతో పాటు వివాహానికి వచ్చే బంధుమిత్రుల (అతిథుల) సౌకార్యార్థం ఫంక్షన్‌హాళ్లలో చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఫంక్షన్‌హాళ్లను ఎంచుకుంటున్నారు. రెండేండ్లుగా కరోనాతో ఫంక్షన్‌హాళ్లు మూతబడ్డాయి. ఈ ఏడాది వైరస్ తగ్గుముఖం పట్టడంతో వివాహా మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ముందుగానే ఫంక్షన్‌హాళ్లను బుక్ చేసుకుంటున్నారు. సిద్దిపేట జిల్లాలో ఒక్కో ఫంక్షన్ హాల్‌కు ఒక్కో ధర ఉంది. జిల్లా కేంద్రం, ఇతర పట్టణాల్లో రూ. లక్ష వరకు అద్దె చెల్లిస్తున్నారు. మండలం, ఇతర ప్రాంతాల్లో రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు అద్దె చెల్లిస్తున్నారు. వివాహాలు అత్యధికంగా ఉండడంతో మ్యారేజ్, రిసెప్షన్స్ కోసం ఫంక్షన్‌హాళ్లలో ఉదయం, రాత్రి వేర్వేరుగా అద్దెలు తీసుకోవడంతో సందడి నెలకొంది. జీవితంలో వివాహం ఒకేసారి జరిగే వేడుక.. డబ్బుకు వెనుకడగు వేయ డం లేదు. ఎందులోనూ తగ్గేది లేదంటూ వధువు, వరుడికి సంబంధించిన వారు పోటాపోటీగా ఆర్భాటాలు చేస్తున్నారు.
పెరిగిన బంగారం ధర..
వివాహ ముహూర్తాలు అత్యధికంగా ఉండడంతో బంగారం ధర భారీగా పెరిగింది. గతంలో బంగారం తులం ధర 50 వేల లోపు ఉండగా, 15 రోజుల కింద తులం బంగారం ధర రూ.54 వేలకు వరకు చేరింది. ఇప్పుడు తులం బంగారం రూ.53 వేలు కొనసాగుతుంది.
వివాహ బంధానికి మంచి తరుణం
ఈ రెండు నెలల్లో ముహూర్తాలు అత్యధికంగా ఉన్నాయి. వివాహ బంధాలకు ఈ సమ యం మంచి తరుణం. రెండేండ్లుగా కొవిడ్ నేపథ్యంలో తక్కువ వివాహాలు జరిగాయి. ప్రస్తుతం ముహూర్తాలు అత్యధికంగా ఉన్నందున రాష్ట్రంలో సుమారు 50 వేలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉంది.
-ఎంఎస్ ఆచార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష్య, జాతక, వాస్తు పండితుడు
జూన్, జూలై నెలల్లో ముహూర్తాలు
జూన్ : 6, 8, 10, 11, 13, 20, 21, 23, 24
జూలై : 3, 4, 5, 6, 7, 8, 9,14, 18, 19, 20, 21, 23, 24, 25, ,30, 31తేదీల్లో మూహూర్తాలు ఉన్నాయి.