రాయపోల్,ఆగస్టు30 : ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణలు సహజమేనని జిల్లా పరిషత్ సీఈఓ రమేష్, డిపిఓ దేవకీ దేవి అన్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల మండల ఎంపీడీవోగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన బాలయ్యకి మండలంలోని జీఏల్ఆర్ పంక్షన్ హాల్లో సన్మాన కార్యక్రమ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు అధ్యక్షులుగా మండల ప్రత్యేక అధికారిగా బాబు నాయక్ వ్యవహరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులు పనిచేస్తున్నప్పుడు చేసిన సేవలే చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు.
ఎంపీడీవో వృత్తి అనేది ఎంతో గొప్పదన్నారు. బాలయ్య శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంఈఓ సత్యనారాయణ రెడ్డి, ఏఓ నరేష్, వైద్యాధికారి మహారాజ్, ఎంపీడీవోలు స్వర్ణలత, మచ్చేందర్, శ్రీనివాస్, మురళీధరన్ శర్మ, దిశా కమిటీ సభ్యులు రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ అనిత శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ యాదగిరి,
బ మాజీ కో ఆప్షన్ సభ్యులు పర్వేజ్, తదితరులు పాల్గొన్నారు.