సమస్యల పరిషారానికే ప్రజావాణి
సమస్యల పరిషారానికే ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ ప్రజలకు సూచించారు. సోమవారం మెదక్ కలెక్టరేట్లో ప్రజావాణి ద్వారా వివిధ సమస్యలపై ప్రజల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు.
- మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : సమస్యల పరిషారానికే ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ ప్రజలకు సూచించారు. సోమవారం మెదక్ కలెక్టరేట్లో ప్రజావాణి ద్వారా వివిధ సమస్యలపై ప్రజల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజ ల సమస్యలను తెలుసుకొని పరిషరించడానికి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు తమ సమస్యల పరిషారానికి నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి చెప్పుకోవాలి కానీ, ఇతరుల మీద ఆధారపడరాదని సూచించారు.వివిధ సమస్యలపై ప్రజలు పెట్టుకున్న136 అర్జీల పరిషారానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం 18, ధరణి భూ సమస్యలు 36, పింఛన్ల కోసం 8, రుణమాఫీ 7, ఇతర సమస్యలపై 67 దరఖాస్తులు వచ్చాయి.
ముదిరాజ్‌లను బీసీ ఏకు మార్చాలి
ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏలోకి మార్చాలని ముదిరాజ్ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు పుట్టి రాజు డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్లో ప్రజావాణిలో భాగంగా ముదిరాజ్‌లను బీసీ ఏలోకి మార్చాలని కోరుతూ కలెక్టర్‌కు ఆయన వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌లో భాగంగా ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీఏలోకి మారుస్తామని చెప్పారని గుర్తు చేశారు. ముదిరాజ్ కులస్తులు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారన్నారు. ముదిరాజ్‌లను బీసీ ఏలోకి మార్చాలని కాసాని జ్ఞానేశ్వర్ గత 20 ఏండ్ల నుంచి పోరాటం చేస్తున్నారని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ముదిరాజ్‌లు వివక్షకు గురయ్యారని, సరైన ఉపాధి లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 2009లో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముదిరాజ్‌లకు ప్రత్యేక జీవో తీసుకువచ్చినా అమలు కాలేదన్నారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా ముదిరాజ్ సం ఘం ఉపాధ్యక్షుడు బాల్‌రాజ్, జనరల్ సెక్రటరీ భిక్షపతి, సురేందర్, శేఖర్, అశ్విని, గణేశ్, బాల్‌చందర్, నాగరాజు, సందీప్, సంతోష్, నాగేశ్వర్ పాల్గొన్నారు.
ప్రభుత్వం ప్రకటించిన పంట రుణమాఫీ కాలేదని 16 పీఏసీఎస్ సంఘాల నాయకులు అధికారులతో మొరపెట్టుకున్నారు. నందికంది పీఏసీఎస్ సంఘం అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజావాణికి వచ్చిన రైతులు తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని గ్రీవెన్స్‌హాల్‌లో నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అర్జీదారులు తమ ఫిర్యాదులను అందజేసి సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు. ప్రజావాణిలో మొత్తం 55 అర్జీలు అందాయి. ఇందులో రెవెన్యూశాఖకు సంబంధించి 33 అర్జీలు రాగా మిగతా 22 వివిధ శాఖలకు సంబంధించి ఉన్నాయి. ఆయా దరఖాస్తులను జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురీలతో కలిసి స్వీకరించిన కలెక్టర్ వాటిని సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో పద్మజారాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రజలకు జవాబుదారీగా ఉండాలి
ప్రజావాణి అధికారులను ఉద్దేశించి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని చెప్పారు. ముఖ్యంగా సమయపాలన పాటించాలన్నారు. జిల్లా అధికారులు కింది స్థాయి ఉద్యోగులకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ప్రజావాణి అనంతరం అధికారులతో వర్షాలపై కలెక్టర్ సమీక్షించారు. మూ డు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలకు రోడ్లు గుంతలు పడి ప్రమాదకరంగా మారాయన్నారు. వన మహోత్సవంలో భాగంగా జిల్లా లక్ష్యం 35, 88,000 కాగా, ఇప్పటి వరకు 45 శాతం పూర్తయిందన్నారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రుణమాఫీ కాలేదని వంద మంది రైతుల మొర
ప్రభుత్వం రూ.లక్షలోపు ఉన్న పంటరుణాలకు మాఫీ వర్తిస్తుందని చెబుతున్నా క్షేత్ర స్థాయిలో సాంకేతిక కారణాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ జిల్లా ర్యాలమడుగు గ్రామానికి చెందిన 100 మంది రైతు లు పంటరుణమాఫీ కాలేదని మెదక్ కలెక్టరేట్లోని ప్రజావాణిలో కలెక్టర్ రాహుల్‌రాజ్‌కు మొర పెట్టుకున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభు త్వం పంటరుణమాఫీ చేసినపుడు ఇండియన్ బ్యాంకులో సాంకేతిక కారణాల వల్ల అప్పుడు కాలేదని ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం పంటరుణమాఫీ చేసినా అదే పరిస్థితి ఉందని రైతులు కలెక్టర్‌కు తెలిపారు. పంటరుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రుణమాఫీ వర్తించేలా చూస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ విషయమై ఇండియన్ బ్యాంకు మేనేజర్‌ను వివరణ కోరగా.. బ్యాం క్లో టెక్నికల్ సమస్య వల్ల పంటరుణమాఫీ కాలేదని, మరో ఐదారు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందన్నారు.
నాకు రుణమాఫీ కాలేదు
నాకు రెండు ఎకరాల భూమి ఉన్నది. 2023 అక్టోబర్ 7న రూ.80 వేల పంట రుణం తీసుకున్నా. ప్రభుత్వం విడుదల చేసిన పంటరుణమాఫీ జాబితాలో నా పేరు రాలేదు. పంటరుణమాఫీ అవుతుందని ఎంతగానో ఎదురు చూశా. సీఎం రేవంత్‌రెడ్డి మా లాంటి రైతులను మోసం చేశాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన రైతులకు కూడా సగం మాత్రమే పంటరుణమాఫీ చేసింది. రూ.లక్ష పంటరుణ మాఫీ చేశామని ప్రభుత్వం చెబుతున్నా అది ఎక్కడా అమలు కావడం లేదు.
బి.నాగరాజు, వెంకట్రావుపేట గ్రామం, తొగుట మండలం, సిద్దిపేట జిల్లా
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

