మర్కూక్, జూన్6 : సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ నేపథ్యంలో ఎక్కడ భూనిర్వాసితులు నిలదీస్తారోనని వారిని ముందస్తుగా అరెస్టు చేశారు. ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం తిరుమలాపూర్లో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ జరిగింది. ఈ నేపథ్యంలో నర్సన్నపేట రీజినల్ రింగ్ రోడ్డు బాధితులను మార్కుక్ పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. సీఎం సభకు వెళ్లి ఏమైనా గొడవలు సృష్టిస్తారనే అనుమానంతోనే వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
సీఎం రేవంత్ రెడ్డి సభ ముగిసిన తర్వాత బాధిత రైతులను పోలీసులు విడుదల చేసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు వెళ్లి తమకు పరిహారం ఎక్కువ ఇప్పించాలని అడుగుదామని అనుకున్నామని తెలిపారు. కానీ ముఖ్యమంత్రి సభకు వెళ్లకుండా ముందస్తుగా అరెస్టు చేయడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.