సిద్దిపేట అర్బన్, జనవరి 2 : సిద్దిపేట పోలీస్ పరేడ్ గ్రౌండ్లో తొమ్మిది రోజులుగా జరుగుతున్న పోలీస్ దేహదారుఢ్య పరీక్షలు నేటితో ముగియనున్నాయి. సోమవారం తొమ్మిదో రోజు పోలీస్ అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహించగా, మొత్తం 1236 మంది అభ్యర్థులకు 1091 మంది ఈవెంట్స్‌లో పాల్గొనగా.. 508 మంది అభ్యర్థులు తుది పరీక్షకు ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా సీపీ శ్వేత మాట్లాడుతూ ఈవెంట్స్‌లో భాగంగా అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అత్యవసర సమయంలో అంబులెన్స్, మెడికల్ బృందం, ఇతర సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) మహేందర్, ఏఆర్ అడిషనల్ డీసీపీలు అడ్మిన్ రామచంద్రరావు, సుభాష్ చంద్రబోస్, ట్రాఫిక్ ఏసీపీ ఫణీందర్, సిద్దిపేట ఏసీపీ దేవారెడ్డి, సంగారెడ్డి డీటీసీ డీఎస్పీ జనార్దన్, ఆర్ఐలు, సీఐలు, ఎస్సైలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.