హుస్నాబాద్: గ్రామీణ, పట్టణ ప్రాంత నిరుపేద కుటుంబాలకు సీఎం రిలీఫ్‌ఫండ్ వరంలా మారిందని ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ అన్నారు. బుధవారం సాయంత్రం హుస్నాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులు, ప్రమాదాల వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్న ఎన్నో కుటుంబాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకుంటు న్నారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ సీఎం నిధి నుంచి సాయం అందుతున్నదన్నారు.
పేదలను అన్ని విధాలుగా ఆదుకొని వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని, ముఖ్య మంత్రి నిధి నుంచి మంజూ రవుతున్న డబ్బులను లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం 12మంది లబ్ధిదారులకు రూ.2,63,000ల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, ఎన్ఎల్సీఎఫ్ డైరెక్టర్ దండుగుల రాజ్యలక్ష్మి, వైస్‌చైర్‌పర్సన్ అనితారెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఎండీ అన్వర్, మాజీ ఎంపీపీ వెంకట్, నాయకులు గోపాల్‌రెడ్డి, డాక్టర్ రవి, హరీశ్, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.